Home » Suryapet
పెన్‌పహాడ్ మండలం దోసపాడు గ్రామంలోని గురుకుల పాఠశాలలో 5వ తరగతి విద్యార్థిని సరస్వతి మృతిపై మంత్రులు పొన్నం ప్రభాకర్, కొమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థిని మృతి తీవ్ర ఆవేదనకు గురి చేసిందని రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. చిన్నారి మృతి పట్ల పొన్నం సంతాపం వ్యక్తం చేశారు. బాలిక కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రిన్సిపాల్ తమపై వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఓ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ విద్యార్థినులు రాస్తారోకోకు దిగారు. ఆ మహిళా ప్రిన్సిపాల్‌ను వెంటనే మార్చాలంటూ రోడ్డుపై ఆందోళన చేపట్టారు. ఈ ఘటన సుర్యాపేట జిల్ల్లా కేంద్రం సమీపంలోని బాలెంలలోని డిగ్రీ కళాశాలలో జరిగింది.
తిరుమలగిరి మున్సిపాలిటీ అనంతారం బిక్కేరు వాగు వద్ద హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ద్విచక్రవాహనంతో సహా తండ్రీకుమార్తె వాగులో పడిన ఘటనలో కుమార్తె మృతిచెందగా.. తండ్రికి తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో స్థానికంగా విషాద వాతావరణం నెలకొంది.
మళ్లీ ఆడపిల్ల పుడితే భర్తకు వేరే పెళ్లి చేస్తామని బెదిరించి లింగనిర్ధారణ పరీక్షకు ఒప్పించి, పుట్టేది ఆడపిల్లని తెలుసుకుని గర్భస్రావం చేయించి గర్భిణి మరణానికి కారకులైన వారిపై పోలీసులు కేసుపెట్టారు.
భార్య కడుపులో పెరుగుతున్నది ఆడపిల్ల అని తెలిసి గర్భస్రావం చేయించేందుకు సిద్ధపడ్డాడా భర్త! ఏడో నెలలో అబార్షన్ చేస్తే తల్లిప్రాణాలకే ప్రమాదమని వైద్యులు హెచ్చరించినా అతడి మనసు మారలేదు! తెలిసిన ఆర్ఎంపీ సాయంతో.. ఓ వైద్యుణ్ని సంప్రదించి.. అతడి మామిడితోటలో దొంగచాటుగా అబార్షన్ చేయించాడు.
‘‘ప్రజాస్వామ్యంలో దేశం దృఽఢంగా ఉండాలి కానీ ప్రభుత్వం కాదు, ప్రభుత్వం దృఢంగా ఉంటే ప్రజలు బలహీనంగా ఉంటారు.. ప్రభుత్వం బలహీనంగా ఉంటే ప్రజలు దృఢంగా ఉంటారు..
ఈ ఫొటోలోని మహిళలు ఉపాధి కూలీలు! వారి మధ్య కూర్చుని ప్లేట్లో అన్నం తింటూ కూలీల్లో కూలీగా కలిసిపోయిన యువకుడు ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) అధికారి సందీప్ బాగా! సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన సందీప్, బెంగళూరు సౌత్ సెంట్రల్ ట్యాక్స్ కమిషనరేట్‌లో జీఎస్టీ ఇన్వెస్టిగేషన్ వింగ్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు.
సాధారణంగా దినసరి కూలీలు.. ఉద్యోగం లేకుండా గ్రామాల్లో ఖాళీగా ఉండే వ్యక్తులు ఉపాధి హామీ పనికి వెళ్తారనేది మనందరికీ తెలుసు. అందుకే దీనిని కరువు పని అని కూడా అంటారు. ప్రజలు కరువులో ఉన్నప్పుడు ప్రభుత్వం ఉపాధి కల్పిస్తోంది. అయితే తెలంగాణలోని సూర్యపేట జిల్లాలోని ఓ గ్రామంలో ఉపాధి హామీ పనిలో ఓ ఐఆర్ఎస్ అధికారి ప్రత్యక్షమయ్యారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యుత్ కొనుగోళ్ల(Electricity Purchage) అక్రమాలపై ఏర్పాటైన జస్టిస్ నరసింహారెడ్డి((Justice Narasimha Reddy)) కమిషన్ ముందే ఓ నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఈ విషయం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి.. కేసీఆర్(KCR)పై చేసిన వ్యాఖ్యల ద్వారా తెలుస్తోందన్నారు.
ఆ బిడ్డకు నిండా రెండేళ్లు కూడా లేవు! హాయిగా నిద్రపోతోంది. ఆమె తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి, ఆ చిన్నారిని ఇష్టమొచ్చినట్లు కొరికి.. నేలకోసి కొట్టి చంపాడు. వివాహేతర సంబంధానికి ఆ బిడ్డ అడ్డొస్తోందనే ఉన్మాదంతో అతడు ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడు.