Home » Tadipatri
జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గంలో రాజకీయం మరోసారి వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దా రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని..
చదువులను మధ్యలో ఆపేసిన వారు సార్వత్రిక విద్యాపీఠం అందిస్తున్న కోర్సుల ద్వారా చదువును కొనసాగించవచ్చునని ఎంఈఓలు కాశప్ప, ధనలక్ష్మి తెలిపారు.
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి స్టైలే వేరు. ఎప్పుడు ఏదో ఒక అంశంతో వార్తల్లో ఉంటారు. తాజాగా తాడిపత్రి యువతకు వార్నింగ్ ఇచ్చారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
జ్వరంతో బాధపడుతూ వైద్యం కోసం వస్తే స్థానిక ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది ఎవరూ లేరని రోగులు వాపోయారు. ఇలా అయితే పేదలకు వైద్యం అందేది ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాడికి ప్రభుత్వ వైద్యశాలకు బుధవారం సాయం త్రం 4గంటల సమయంలో పలువురు రోగులు వచ్చారు. హాస్పిటల్‌లోని డాక్టర్లు ఉండేగది, ఇంజక్షన్లు వేసే గది తదితర గదులన్నీ మూసి వేసి సిబ్బంది ఎక్కడికో వెళ్లిపోయారు.
వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా బుధవారం పట్టణంలో విగ్రహాల నిమజ్జన కార్యక్రమం వైభవంగా జరిగిం ది. ఈ సందర్భంగా మండపాల వద్ద గణనాథులకు ప్రత్యేక పూజలు నిర్వహించి సీబీరోడ్డు, యల్లనూరురోడ్డు, పుట్లూరురోడ్డు, మెయినబజారు, గాంధీకట్ట మీదుగా ఊరేగించారు. దాదాపు 200 వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు.
పట్టణంలో వినాయక మండపాల వద్ద నాలుగోరోజు మంగళవారం పూజలు కొనసాగాయి. పలు మండపాల వద్ద అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని బుధవారం ఘనంగా నిర్వహించనున్నా రు. ఉదయం 10గంటలకు ప్రత్యేక పూ జల అనంతరం విగ్రహాలను ప్రత్యేక వాహనాల్లో ఉంచి ఊరేగింపుగా మఽధ్యా హ్నానికి ప్రధాన రహదారి సీబీరోడ్డుకు తీసుకురానున్నారు.
ఇసుక అక్రమ రవాణా వ్యవహారం తాడిపత్రిలో మంగళవారం ఉద్రిక్తతకు దారితీసింది. ఇసుక అక్రమ రవాణాకు రూరల్ సీఐ లక్ష్మీకాంతరెడ్డి సహకరిస్తున్నారని, వాహనాలను పట్టించినా కేసులు నమోదు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే జేసీ అశ్మిత రెడ్డి మంగళవారం ఆందోళనకు దిగారు. పార్టీ నాయకులతో కలిసి రూరల్ పోలీ్‌సస్టేషన ఎదుట ధర్నా నిర్వహించారు. నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి తన అనుచరుల బృందాన్ని ఏర్పాటు ...
Andhrapradesh: తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి మంగళవారం జేసీ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారికి హెచ్చరికలు జారీ చేశారు. తన దగ్గర వాళ్లే ఇసుక దందా చేస్తున్నారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
Andhrapradesh: తాడిపత్రిలో వైసీపీ నేతల తీరు మారలేదు. పట్టపగలే తుపాకులు పట్టుకుని వైసీపీ నేత కందిగోపుల మురళి హల్చల్ చేశాడు. ఏబీఎన్ రిపోర్టర్ రమణను అసభ్య పదజాలంతో దూషిస్తూ కాల్చివేస్తానంటూ బెదిరింపులకు దిగాడు సదరు వైసీపీ నేత. కందిగోపుల మురళి బెదిరింపులపై ఎస్పీ జగదీష్‌కు జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్నికల సమయంలో ఘర్షణల కారణంగా టీడీపీ, వైసీపీ ముఖ్య నేతలను పోలీసులు పట్టణానికి దూరంగా ఉంచారు.