Home » Tamil Nadu
రైల్వేస్టేషన్(Railway station)లో ఆగకుండా వెళ్లిన రైలు మళ్లీ వెనుక్కి వచ్చిన వ్యవహారంలో లోకోపైలట్(Loco pilot)పై సస్పెన్షన్ వేటుపడింది. తిరునల్వేలి నుంచి తిరుచెందూర్ వెళ్లే రైలు శుక్రవారం ఉదయం 7.50 గంటలకు శ్రీవైకుంఠం సమీపంలోని తాతన్కుళం రైల్వేస్టేషన్ మీదుగా తిరుచెందూర్ వెళుతోంది.
వాణియంబాడి సమీపం పెరియపేట్టై ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ మున్వర్బాషా కారు కొనేందుకు బ్యాంక్ రుణం కోసం దరఖాస్తు చేసుకున్న కొద్ది రోజులకు రూ 2.22 కోట్ల జీఎస్టీ(GST) బకాయిల నోటీసు అందింది.
సెంథిల్ బాలాజీ(Senthil Balaji) మంత్రిగా ఎలా కొనసాగుతున్నారంటూ సుప్రీంకోర్టు(Supreme Court) మళ్లీ నిలదీసింది. చట్టవ్యతిరేక నగదు బదిలీ కేసులో ఈడీ అరెస్ట్ చేయగా, సెంథిల్ బాలాజి 461 రోజులు జైలులో ఉండి, బెయిలుపై విడుదలయ్యారు.
బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం మన్నార్జలసంధి వద్ద తీరం దాటడం, ఈశాన్య రుతుపవనాలు ఉగ్రరూపం దాల్చటంతో నగరంలో రెండు రోజుల పాటు భారీ వర్షం కురిసింది. దీంతో తల్లడిల్లిన నగరవాసులు, శుక్రవారం వరుణదేవుడు కాస్త విశ్రాంతి తీసుకోవడంతో ఊరట చెందారు.
టంగ్స్టన్ సొరంగం ఏర్పాటును విరమించుకోవాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి(Union Minister Kishan Reddy)కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(Annamalai) వినతిపత్రం సమర్పించారు. ఈ విషయమై త్వరలో ఆశించిన ప్రకటన వెలువడుతుందని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని అన్నామలై తెలిపారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మన్నార్ జలసంధి తీరం వైపు దూసుకురావటంతో రాష్ట్రమంతటా బుధవారం అర్ధరాత్రి నుండి గురువారం సాయంత్రం వరకూ భారీ వర్షం కురిసింది.
రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాల కారణంగా వేర్వేరు ఘటనల్లో పాఠశాల విద్యార్థి, అయ్యప్య భక్తుడి సహా నలుగురు మృతిచెందారు. వారిలో ముగ్గురు విద్యుదాఘాతంతో మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో పది రోజుల కిత్రం ‘ఫెంగల్’ తుఫాన్ కారణంగా పలు ప్రాంతాల్లో పదిమంది మృతిచెందారు.
బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం మన్నార్ జలసంధి తీరం వైపు కదులుతుండటంతో రాష్ట్రంలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తీవ్ర అల్పపీడనం వల్ల ఈశాన్య రుతుపవనాలు సైతం బలాన్ని పుంజుకున్నాయి.
తమిళనాడులో దిండుగల్లోని సిటీ ఆస్పత్రిలో గురువారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనం అయ్యారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక బాలుడు ఉన్నారు.
జమిలి ఎన్నికల దిశగా కేంద్ర ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేసింది. లోక్సభకు, దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన రెండు బిల్లులకు గురువారం కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.