Home » Tamil Nadu
పులి దాడిలో ఓ వృద్ధురాలిని చంపేసిన విషాద సంఘటన తమిళనాడు రాష్ట్రం నీలగిరి జిల్లలో చోటుచేసుకుంది. నాగియమ్మాళ్ అనే వృద్ధురాలు పులి దాడిలో మృతిచెందడంతో ఆమె కుటుంబంలో విషాదం నెలకొంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
విచారణ జరపకుండా ఒక్క ఓటు కూడా తొలగించలేరు.. అని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ స్పష్టం చేశారు. మరికొద్ది రోజుల్లో సాధారణ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.. కాగా... ఓట్ల తొలగింపు అంశపై వస్తున్న ఆరోపణలపై న్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ మాట్లాడారు.
రాష్ట్ర న్యాయశాఖ మంత్రి రఘుపతి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ‘సి’ టీం టీవీకే పార్టీ.. అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారాన్ని లేపుతున్నాయి. మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో ‘పొలిటికల్ హీట్’ బాగా పెరిగిపోయింది.
చెన్నై నగరాన్ని వర్షాలు వదలడం లేదు. వారానికోసారి తుపాన్లు అతలాకుతలం చేస్తున్నాయి. మళ్లీ 29వతేదీ నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో రెండు వాయుగుండాలు ఏర్పడుతున్నాయని, దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
తమిళ రాష్ట్రంలోని థెన్‌కాసి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)కి వ్యతిరేకంగా తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ గళం విప్పింది. 'సర్' ని నిలిపివేయాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఆ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది.
ప్రభుత్వానికి స్థలం విరాళంగా అందజేసిన దంపతులను అధికారులు ఘనంగా సత్కరించారు. తిరుప్పూర్ కార్పొరేషన్ 8వ వార్డు ప్రాంతంలో కాలువలు సక్రమంగా లేకపోవడంతో, వర్షాల సమయంలో నీరు వెళ్లే దారిలేక సమీపంలోని ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయి.
చెన్నై నగరంలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు నడిపేందుకు చెన్నై మహానగర రవాణా సంస్థ నిర్ణయించింది. ఇదివరకు డబుల్ డెక్కర్ బస్సులు ఉండేవి. ఆ తర్వాత వాటిని తీసివేశారు. కాగా... మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులను సిటీలో సేవలందించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది.
టీవీకే పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ హీరో విజయ్‌పై డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత ఆగ్రహం వ్యక్తం చేశారు. కరూర్‌లో టీవీకే ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ విజయ్ మాత్రం నోరు మెదపకపోవడం ఎంతో వేదనకు గురిచేస్తోందని ఆమె అన్నారు.
తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, ప్రముఖ హీరో విజయ్‌కి పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయన సభలకు అనుమతి ఇవ్వలేం.. అంటూ పేర్కొనడం తమిళనాట ఇప్పుడు సంచలనానికి దారితీస్తోంది. కరూర్ లో విజయ్ పాల్గొన్న సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణింంచిన సంగతి తెలిసిందే..