Home » TDP
ఆంధ్రప్రదేశ్కు కేంద్రం వరాల జల్లు కురిపించింది. అమరావతి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ హైవే, తిరుపతి-కాట్పాడి రైల్వే డబ్లింగ్తో పాటు కీలక ప్రాజెక్టులకు ఆమోదం ఇచ్చింది.
వెలిగొండ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి 2026 జూన్ నాటికి ఆయకట్టుకు నీరు అందించాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. మిగిలిన పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని వీడియో కాన్ఫరెన్స్లో స్పష్టం చేశారు
ఆంధ్రప్రదేశ్లోని కొత్తగా ఏర్పాటైన 10 పట్టణాభివృద్ధి అథారిటీలకు అభివృద్ధి అనుమతులు ఇచ్చే అధికారాన్ని మళ్లీ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో నిలిపివేసిన ఆ అనుమతులను తిరిగి అమల్లోకి తీసుకొచ్చారు
రేషన్ కార్డుదారులకు రాబోయే జూన్ నుంచి బియ్యానికి బదులుగా ఉచితంగా రాగులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నెలా రేషన్లో రెండు కేజీలు రాగులు తీసుకునే అవకాశం లభించనుంది
వైసీపీ అధినేత జగన్ సొంత పార్టీ నేతలను, ప్రత్యర్థి పార్టీ నేతలను కేసుల్లో ఇరికించి రాజకీయ వ్యూహం అమలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఆయన బూతులు తిట్టడం ద్వారా పార్టీ శ్రేణులను తన దగ్గర ఉంచుకోవాలని చూస్తున్నట్లు చర్చ జరుగుతోంది
మంత్రి గుమ్మడి సంధ్యారాణి సాలూరు కేజీబీవీ పాఠశాలపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. నాణ్యతలేని భోజనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు
పంచాయతీరాజ్ శాఖలో ప్రక్షాళనకు శంకుస్థాపనగా ఉద్యోగుల కేడర్లో సమానతకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంపీడీఓల నుంచి సీఈఓల వరకు క్రమబద్ధమైన పదోన్నతులు, శిక్షణ విధానం అమలులోకి వస్తున్నాయి
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జగన్పై తీవ్రంగా స్పందిస్తూ, ఆయన భాష మార్చుకోకపోతే వైసీపీని రాజకీయ సమాధి చేస్తామని హెచ్చరించారు. పోలీసులపై చేసిన వ్యాఖ్యలు ప్రజల ప్రశాంతతకు విఘాతం కలిగిస్తాయని అన్నారు
42 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని చరిత్రాత్మకంగా గుర్తు చేస్తూ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తన అనుభవాలను పంచుకున్నారు.1995 ఆగస్టు సంక్షోభంలో తన పాత్రను వివరిస్తూ, టీడీపీలో తనకు దక్కిన స్థానం ప్రత్యేకమని అన్నారు
జగన్ పత్రికలో తప్పుడు కథనాలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు సహా పలువురు నేతలు హరీష్ కుమార్ను కలిసి ఫిర్యాదు చేశారు