Home » TDP
సినిమా విడుదలైనప్పుడు హీరోలు వస్తే అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంటుందని, ఆ సమయంలో హీరోలు వెళ్ళకపోవడమే మంచిదని ఏపీ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలు భవిష్యత్తులో ఉత్పన్నం కాకుండా చూసుకోవలసిన అవసరం ఉందన్నారు.
కూటమి ప్రభుత్వం ఎంత ఖర్చయినా గోదావరి - పెన్నా పూర్తి చేసి, రాయలసీమను రతనాల సీమగా మార్చుతామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. రాయలసీమ బిడ్డ అని చెప్పు కుంటూనే, గతంలో ఏ ముఖ్య మంత్రి చేయని ద్రోహం జగన్ మోహన్ రెడ్డి చేశారని మంత్రి విమర్శించారు.
చంద్రబాబు నాయుడు అక్రమ కేసులో జైలుకు వెళ్లినప్పుడు పోరాడింది స్త్రీలేనని వారి శక్తి అపారమని, వారు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి కుప్పం పర్యటనలో ఈ వ్యాఖ్యలు చేశారు.
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూడండి.
క్రైస్తవులకు నిజమైన సాయం చేసింది తెలుగుదేశం పార్టీయేనని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు.
వైఎస్సార్సీపీ హాయంలో రాష్ట్రంలో ఇండస్ట్రీలు భయపడి అన్నీ వెనక్కి వెళ్ళిపోయాయని, చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఇప్పుడిప్పుడే పరిశ్రమలు వస్తున్నాయని నారా భువనేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్నామని, నిరుపేద కుటుంబాలకు విద్యార్థులకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఆర్థికంగా సహాయ సాకారం అందిస్తున్నామని తెలిపారు.
కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి రెండో రోజు శుక్రవారం పర్యటన కొనసాగుతోంది. ఆమె బస చేసిన పిఎస్ మెడికల్ కాలేజీ ఆవరణంలో ఉదయం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అభివృద్ధిలో కుప్పం నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని భువనేశ్వరి అన్నారు.
గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ ఆహ్వాన కమిటీ వాళ్ల ఆహ్వానం మేరకే తాను ఆ కార్యక్రమానికి వెళ్లానని, జోగి రమేష్ వస్తున్నారన్న సమాచారం తనకు ఏ మాత్రం తెలియదని.. తాను అక్కడకు వెళ్లిన తర్వాత జోగి రమేష్ వచ్చారని కొనకళ్ల నారాయణరావు వివరించారు.
Andhrapradesh: టీడీపీకి చెందిన యూట్యూబ్ ఛానల్ను దుండగులు హ్యాక్ చేశారు. దీంతో ఉదయం నుంచి ఛానల్ నిలిచిపోయింది. ఛానల్ను ఓపన్ చేసిన వారికి స్ట్రక్ అయినట్టు వస్తుందని ఫిర్యాదు చేశారు. దీనితో టీడీపీ టెక్నికల్ వింగ్ రంగంలోకి దిగింది. హ్యాకర్లను గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది.
నూజివీడులో జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం టీడీపీలో పెనుతుపాను రేపుతోంది. వైఎస్సార్సీపీ హయాంలో టీడీపీ నాయకులను బూతులు తిట్టి.. కేసులతో వేధించి.. టీడీపీ కార్యాలయాలపై దాడులు చేసిన వైసీపీ నేతలకు ఈ కార్యక్రమంలో పెద్ద పీట వేయడమే కాకుండా వారితో కలిసి వేదిక పంచుకోవడం తమ్ముళ్ల ఆగ్రహావేశాలకు కారణమైంది.