Home » TDP
ఉత్తరాంధ్ర సిగలో మరో కలికితురాయి. విశాఖ నగరానికి సమీపాన అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ఆర్సెలర్ మిట్టల్, నిప్పన్ స్టీల్ ఇండియా కలిసి జాయింట్ వెంచర్ ప్రాజెక్టు కింద భారీ పెట్టుబడితో తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకూ గుర్తింపు ఇస్తారనేందుకు తానే ఉదాహరణ అని చేర్రెడ్డి మంజులారెడ్డి చెప్పారు. హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్‌గా నియమితులైన మంజులారెడ్డి.. మంగళవారం విజయవాడ శిల్పారామంలో బాధ్యతలను చేపట్టారు.
పేదరిక నిర్మూలన కోసం ఫోర్పీల సూత్రాన్ని అమలు చేస్తున్నామని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయ సమావేశ మందిరంలో తహసీల్దార్ నాగరాజు అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన చేసిన అవినీతి, అక్రమాలు అమెరికాకు పాకిందంటే ఆయన ఏ స్థాయిలో అవినీతికి పాల్పడ్డాడో అర్థం చేసుకోవచ్చని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు విమర్శించారు.
గత అయిదేళ్లు మర్చిపోదాం అనుకున్నా.. అందరికి గుర్తుండాలని.. నాల్గవ సారి సీఎం అయినా ఇంకా పూర్తిగా విద్వంసానికి గురయిన వ్యవస్ధను కాపాడడం కష్టంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాజ్యాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ప్రాధమిక హక్కులు కాలరాశారని విమర్శించారు. రాజ్యాంగంలోని జరిగిన తప్పిదాలు వల్ల కొన్ని దశాబ్దాలు ఇబ్బంది పడతామని ఆయన పేర్కొన్నారు.
కర్నూలు అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ (కుడా) చైర్మన్‌గా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.
అదానీ నుంచి రూ.1,750 కోట్ల ముడుపులు తీసుకున్నట్లు అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో.. జగన్ విచారణకు వెళ్తే ఇక జీవితాంతం ఏపీకి తిరిగి రాలేడని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న అన్నారు.
భూ దురాక్రమణలు, వైసీపీ నేతల అరాచకాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏపీ హౌసింగ్ బోర్డు చైర్మన్ బత్తుల తాతయ్యబాబు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ వినతులు స్వీకరించారు.
జగన్ ప్రభుత్వంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరిగిన రాళ్ల దాడి కేసులో పోలీ సులు చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. ఈ దాడితో సంబంధం ఉన్న నలుగురిని శనివారం అదుపులోకి తీసుకున్నారు.
అనంతపురం అర్బన నియోజకవర్గంలో సభ్యత్వ నమోదును మరింత వేగవంతం చేయాలని నియోజకవర్గ పరిశీలకుడు లక్ష్మీనారాయణ సూచించారు. శుక్రవారం అనంతపురం అర్బన టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో ఆయన సమావేశమయ్యారు.