Home » TDP
బీసీల అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవనకల్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేశ కంకణం కట్టుకున్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో రాష్ట్రంలో స్వర్ణయుగం మొదలైందని అన్నారు.
మహిళల భద్రతకు పెద్దపీట అని ఆర్భాటపు ప్రచారాలు తప్ప10 ఏళ్లలో ఏ ఒక్క నేరస్థుడికీ కఠిన శిక్ష పడలేదని వైఎస్ షర్మిల అన్నారు. కేసులు ఛేదించాల్సిన పోలీసులను కక్ష్యసాధింపు రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆమె ఆరోపించారు.
జగన్ను చూసి చాలా రోజులు అవుతుంది.. కానీ ఆయన మాత్రం అసెంబ్లీకి రావడం లేదని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. దీనికి పరిష్కారం ఏంటంటే.. రోజుకు జగన్కు గంట మాట్లాడేందుకు సమయం ఇస్తే వస్తారన్నారు. ఇంకొ విషయం ఏంటంటే.. ఆయన ఏం మాట్లాడినా అద్దం రాకూడదని.. ఇది జగన్ ఫిలాసఫీ అని అన్నారు.
గ్రామాలే అభివృద్ధికి పట్టుగొమ్మలు.... గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రాభివృద్ధి చెందుతుంది... అని నిత్యం ప్రజాప్రతినిధులు చేప్పేమాటలు. వాటిని గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా మరిచింది. ఎన్నికల ముం దు హడావుడిగా పనులు చేపట్టేందుకు ప్రయత్నాలు చేసినా కార్యరూపం దాల్చింది అంతంత మాత్రమే.
కడప కార్పొరేషన్ను వైఎస్సార్సీపీ నిర్వీర్యం చేసిందని, సచివాలయంలో ఎవరి బాధ్య త ఏమిటో తెలియక పని చేస్తున్నారని విమర్శించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కడప జిల్లా అభివృద్ధికి నోచుకోలేదని, ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తామని శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించకుండా శంకుస్థాపనకే పరిమితం చేశారని ఆమె ఆరోపించారు.
రాష్ట్రవ్యాప్తంగా గతంలో టీడీపీ ప్రభుత్వం నిర్మించిన టిడ్కో ఇళ్లు మాజీ సీఎం జగన్ పిచ్చిచేష్టలతో సర్వనాశమయ్యాయని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పొంగూరు నారాయణ ధ్వజమెత్తారు.
ఫ్యాన్ గాలి మారింది. రెక్కలు ఒక్కొకటిగా ఎగిరిపోతున్నాయి. జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోతుంది. ఇప్పటికే రెండు నియోజకవర్గాల్లో ఫ్యాన్ రెక్కలు విరిగిపడ్డాయి. మిగిలిన నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి ఉంది. అవకాశం వస్తే జారుకునేందుకు నేతలు సిద్ధంగా ఉన్నారు.
గత అసెంబ్లీలో మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని మద్యంతో కుటుంబాలు ఎలా ఇబ్బంది పడుతున్నాయనే అంశంపై మాట్లాడిడే.. ఆమెపై వైసీపీ సోషల్ మీడియాలో అసభ్యంగా ట్రోల్ చేసిందని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై అప్పట్లో స్పీకర్కు ఫిర్యాదు చేశామని గుర్తుచేశారు.
శాసన మండలిలో విపక్షంపై మంత్రి నారా లోకేశ్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు తమ హయాంలో శాసనసభకు రాకుండా పారిపోయారంటూ వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు.
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.