Home » Team India
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో కడప జిల్లాకు చెందిన 21 ఏళ్ల శ్రీ చరణి.. 9 మ్యాచ్‌ల్లో 4.96 ఎకానమీతో 14 వికెట్లు పడగొట్టి.. అద్భుతంగా రాణించింది. 9 మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్ మినహా.. ప్రతీ మ్యాచ్‌లో శ్రీ చరణి వికెట్ తీసింది.
ప్రపంచకప్ గెలుపుతో భారత మహిళా క్రికెటర్ల బ్రాండ్ వాల్యూ అమాంతం పెరిగిపోయింది. హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌ల ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగింది.
మహిళా జట్టు ప్రపంచకప్ గెలిచిన తర్వాత మిథాలీ రాజ్‌కు ట్రోఫీ అందించడం అద్భుతమని రవిచంద్రన్ అశ్విన్ అభినందించాడు. పురుషుల జట్టు అలాంటి పని ఎప్పుడూ చేయలేదని పేర్కొన్నాడు.
ఐసీసీ వన్డే మహిళల ప్రపంచ కప్ 2025లో భాగంగా గురువారం జరిగిన రెండో సెమీస్‌లో టీమిండియా ఆసీస్‌పై సంచలన విజయాన్ని నమోదు చేసింది. దీంతో టీమిండియాపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత దిగ్గజాలు విరాట్, సచిన్, వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
ఐసీసీ వన్డే మహిళల ప్రపంచ కప్ 2025 సెమీస్‌లో టీమిండియా చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో టీమిండియా ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఆసీస్ ఓటమి పాలైనప్పటికీ ఆ జట్టు బ్యాటర్ లిచ్‌ఫీల్డ్ సెంచరీ చేసి రికార్డు సృష్టించింది.
ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందే తమ కోచింగ్ స్టాఫ్‌లో లక్నో యాజమాన్యం పలు మార్పులు చేసేందుకు సిద్ధమైంది. భారత క్రికెట్ దిగ్గజం, మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌కు ఎల్ఎస్‌జీ హెడ్ కోచ్ బాధ్యతలు అప్పగించే ప్రయత్నంలో ఫ్రాంచైజీ యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై ఇప్పటికే యువీతో చర్చలు జరిపినట్లు సమాచారం.
నవంబర్ 14 నుంచి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. అయితే ఈ సారి భారత్‌లో కొత్త సంప్రదాయానికి తెరలేవనుంది. గువాహటిలో ఇప్పటి నుంచి మొదట టీ బ్రేక్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత రెండో సెషన్ ముగిసిన తర్వాత లంచ్ బ్రేక్ ఇస్తారు.
క్రికెట్ అంటే ఆస్ట్రేలియా ఆధిపత్యం ఎక్కువ గా కనిపిస్తుంది. ఇక ఐసీసీ టోర్నీల్లో అయితే ఆ జట్టు చెలరేగిపోతుంది. పురుషుల జట్టైనా, మహిళల జట్టైనా ఆస్ట్రేలియాకు వరల్డ్ కప్ అంటే పూనకం వస్తుంది. వాళ్లను ఆపడం అంత ఈజీగా కాదు. మహిళా ప్రపంచ కప్ ను అత్యధిక సార్లు గెలిచిన జట్టుగా ఆసీస్ కు రికార్డు ఉంది.
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ తల్లి స్వప్న యాదవ్ శ్రేయస్ ఆరోగ్యంగా ఉండాలని పూజలు చేసింది. సూర్య సోదరి దీనాల్ యాదవ్ షేర్ చేసిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టీమిండియా ఆటగాళ్లను గాయాల బెడద వేధిస్తోంది. ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. రెండో వన్డేలో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి గాయంతో వైదొలిగాడు. అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నాడు. కాగా నితీశ్ గాయంపై బీసీసీఐ అప్‌డేట్ ఇచ్చింది.