Home » Tejashwi Yadav
సార్వత్రిక ఎన్నికల సమరం దగ్గర పడుతున్నకొద్దీ అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమిల దృష్టి ఆ 120 నియోజకవర్గాల మీదే పడిందా. అంటే అవుననే అంటున్నారు రాజకీయ నిపుణులు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ఇవాళ బిహార్(Bihar)లో ముగియనుంది. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్(Tejaswi Yadav) శుక్రవారం ససారంలో రాహుల్ గాంధీతో కలిసి న్యాయ్ యాత్రలో పాల్గొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీని బీహార్‌లో తాము అడ్డుకుంటామని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సవాలు విసిరారు. ఒకే టర్మ్‌లో మూడు సార్లు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రికార్డు నితీష్ కుమార్‌కే దక్కుతుందంటూ విసుర్లు విసిరారు.
పాట్నా: బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇచ్చిన నోటీసుల మేరకు మంగళవారం ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు. ఉద్యోగాల కుంభకోణం కేసులో ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈడీ కార్యాలయం దగ్గరకు ఆర్జేడీ నేతలు భారీగా చేరుకున్నారు.
Tejashwi Yadav First Reaction On Nitish: నితీష్ కుమార్ యాదవ్ మహాఘట్బంధన్ నుంచి వైదొలిగిన తరువాత తొలిసారి స్పందించారు ఆర్జేడీ నేత, బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్. జేడీ(యూ)(JDU)-బీజేపీ(BJP) కలిసి అధికారం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.. కానీ, బీహార్‌లో ఆట ఇంకా ముగియలేదు, అసలు గేమ్ ముందుంది అని ఫస్ట్ కామెంట్ చేశారు తేజస్వి యాదవ్.
క్విడ్ ప్రోకోలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి భూ మార్పిడి చేసుకున్నారనే కేసులో బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, మాజీ కేంద్ర రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవితో పాటు మరో 14 మంది నిందితులకు ఢిల్లీ కోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది.
గుజరాతీలపై చేసిన ఆరోపణలకు సంబంధించి బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కు అహ్మదాబాద్ మెట్రోపాలిటన్ కోర్టు సోమవారంనాడు సమన్లు జారీ చేసింది. ''దేశ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే గుజరాతీలు మాత్రమే మోగగాళ్లు'' అంటూ తేజస్వి చేసిన ఆరోపణలకు సంబంధించిన క్రిమినల్ డిఫమేషన్ కేసులో కోర్టు ఈ సమన్లు పంపింది.
బిహార్‌లోని దర్భంగలో AIIMS ఏర్పాటుపై బీజేపీ, ఆర్జేడీ మధ్య మాటల యుద్ధం తీవ్రంగా సాగుతోంది. దర్భంగలో ఎయిమ్స్ ఏర్పాటు గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పడాన్ని బిహార్ ఆరోగ్య శాఖ మంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ దుయ్యబట్టడంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఘాటుగా బదులిచ్చారు.
నితీశ్ కుమార్ బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ లక్నోలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ను కలుసుకున్నారు.
సమావేశానంతరం ముగ్గురూ కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. తమ మధ్య చర్చలు సానుకూలంగా సాగాయని చర్చల అనంతరం నితీశ్ చెప్పారు.