Home » Telangana BJP
సిరిసిల్లలో వరద ప్రభావిత ప్రాంతాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పరిశీలించారు. అయితే ఈ సమయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నర్మాల ప్రాజెక్ట్ దగ్గరకు కేటీఆర్, కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఒకే సమయంలో వచ్చారు.
కేంద్రమంత్రి బండి సంజయ్ బీసీ కాదని.. దేశ్‌ముఖ్ అని టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు. బీసీల గురించి బండి సంజయ్ ఎప్పుడైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు దేవుడి పేరుతో ఓట్లు అడిగే బిచ్చగాళ్లు అని ఆక్షేపించారు.
కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో యూరియా కొరత నెలకొంటే రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడం కిషన్ రెడ్డి స్థాయికి తగదని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా దిగుమతులు లేక దేశీయంగా ఉత్పత్తి డిమాండ్‌కు తగ్గ స్థాయిలో లేక నెలకొన్న కొరతపై వాస్తవాలు దాచిపెడుతున్నారని ఫైర్ అయ్యారు.
జర్నలిస్టులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ భరోసా ఇచ్చారు. జర్నలిస్టులారా.... బాధపడకండి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల వైఫల్యాలవల్లే మీకు ఇళ్ల స్థలాలు రావడం లేదని ఆందోళన వ్యక్త చేశారు. న్యాయ నిపుణులతో చర్చించకుండా తూతూ మంత్రంగా జీవో ఇవ్వడంవల్లే ఈ దుస్థితి వచ్చిందని వాపోయారు. ఓట్ల కోసం ఆ రెండు పార్టీలు అడ్డగోలు హామీలిస్తూ అధికారంలోకి వచ్చాక గాలికొదిలేస్తున్నాయని బండి సంజయ్ ధ్వజమెత్తారు.
కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా బీజేపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాంచందర్ రావు జోస్యం చెప్పారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, నిరాధారమైనవని, అవి తన ప్రతిష్టను దిగజార్చే ఉద్దేశంతో చేసినవని కేటీఆర్ లీగల్ నోటీసులో పేర్కొన్నారు.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కిషన్‌రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కిషన్‌రెడ్డి ముందుగా చట్టం చదవాలని సూచించారు. రాజకీయ ఓబీసీ రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ లేదని స్పష్టం చేశారు. బీసీఈకి ఇప్పటికే 4శాతం రిజర్వేషన్లు ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి తేల్చిచెప్పారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్యర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్‌లో ధర్నా సైతం చేపట్టారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలపై బీజేపీ నేతలు వరసగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి.
జయ శంకర్ సార్ జయంతి సందర్భంగా జాగృతి ఫౌండేషన్ డే జరుపుకుంటున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. సామాజిక తెలంగాణ కోసం పాటుపడాలని జయశంకర్ సార్ అనేక సార్లు చెప్పారని గుర్తుచేసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్నివర్గాల వారికి సమన్యాయం జరగాలని జయశంకర్ సార్ చెప్పే వారని పేర్కొన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ నేతలు తనకు టచ్‌లోకి వచ్చిన మాట వాస్తవమని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పష్టం చేశారు. తన నియోజకవర్గం ప్రజల అభిప్రాయం మేరకు ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. బీఎల్ సంతోష్‌ను తాను ఎప్పుడూ విమర్శించలేదని గువ్వాల బాలరాజు పేర్కొన్నారు.