Home » Telangana BJP
ఎమర్జెన్సీ పేరుతో కాంగ్రెస్ చేసిన అరాచకాల గురించి ప్రజలందరికీ తెలియాలని బీజేపీ మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. నాడు పేదలపై అరాచకాలు చేశారని.. ఈనాడు సామాజిక న్యాయం అంటూ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు నత్తనడకన నడుస్తోందని బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. అధికారులందరూ కేసీఆర్‌కు తొత్తులుగా వ్యవహారించారని ఆరోపించారు ప్రభాకర్‌రావు నిబంధనలు అతిక్రమించి మాజీ సీఎం కేసీఆర్ కోసం పనిచేశారని ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పినట్లుగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ని ఏటీఎం లాగా బీఆర్ఎస్ నేతలు వాడుకున్నది వాస్తవం కాదా అని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా చెప్పిన మాటలే తమ స్టాండ్ అని రాజాసింగ్ ప్రకటించారు.
Rajasingh Controversy: ఎమ్మెల్యే రాజాసింగ్‌పై తెలంగాణ బీజేపీ సీరియస్‌గా ఉంది. స్టేట్ బీజేపీపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
సోషల్ మీడియాలో పార్టీ నేతలపైన వ్యక్తిగతంగా కొంతమంది మాట్లాడిస్తున్నారని.. అలా చేయొద్దని తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్ హెచ్చరించారు. యూట్యూబ్ ఛానల్స్ వెనుక ఎవరున్నారనేది విచారణ చేస్తున్నామని.. వాటి వెనుక బీజేపీ నేతలు ఎవరైనా ఉన్నట్లు తేలితే వ్యవహారం సీరియస్‌గా ఉంటుందని అభయ్ పాటిల్ వార్నింగ్ ఇచ్చారు.
రఘునందన్ ఇంకోసారి రాహుల్ గాంధీ గురించి మాట్లాడితే తమ ప్రతాపం చూపిస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హెచ్చరించారు. బీజేపీ నేతలు చిల్లరగా మాట్లాడితే తాను ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ చరిత్ర గురించి రఘునందన్‌కి ఏం తెలుసని జగ్గారెడ్డి ప్రశ్నించారు.
బీజేపీలో మెర్జ్ కోసం ఎవరితో చర్చలు జరిగాయో. కేసీఆర్ ఆ ఆధారాలను బయట పెట్టాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సవాల్ చేశారు. ఇది తెలంగాణ ప్రజలకు సంబంధం లేని అంశమని కిషన్‌రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై ఎంపీ ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బీజేపీ స్టేట్ ఫైట్ తప్పా.. స్ట్రీట్ ఫైట్ చేయదని స్పష్టం చేశారు. నీచ రాజకీయాల తాము చేయబోమని తేల్చిచెప్పారు ఈటల రాజేందర్.
Kishan Reddy: ప్రధాని మోదీ మన్‌కీ బాత్ కార్యక్రమాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వీక్షించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రధాని దేశప్రజలతో మమేకవుతున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు.
NVSS Prabhakar: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై బీజేపీ తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ప్రభుత్వం ధాన్యాన్ని కొనకుండా రైతులను ఇబ్బంది పెడుతోందని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. దళారులకు ధాన్యం వదిలిపెట్టడంతో ఇష్టారాజ్యంగా మారిందని విమర్శించారు.