Home » Telangana High Court
Telangana: గ్రూప్ - 1 మెయిన్స్ పరీక్షలకు అడ్డంకులు తొలగిపోయాయి. వివిధ కారణాలతో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలపై హైకోర్టులో అభ్యర్థులు పలు పిటిషన్లు దాఖలు చేశారు. మంగళవారం ఉదయం ఈ పిటిషన్లపై విచారణకు రాగా.. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలపై దాఖలైన పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది.
Telangana: హైడ్రా కూల్చివేతలు తక్షణమే ఆపేయాలని పాల్ వాదనలు వినిపించారు. అయితే ఇప్పటికిప్పుడు కూల్చివేతలు ఆపలేమని న్యాయస్థానం వెల్లడించింది. హైడ్రా కు చట్టబద్దత కల్పించిన తరువాతే యాక్షన్ మొదలు పెట్టాలని పార్టీ ఇన్ పర్సన్‌గా కేఏ పాల్ వాదనలు వినిపించారు.
Telangana: ‘‘చార్మినార్‌ను కూల్చాలని అక్కడి ఎమ్మార్వో చెబితే మీరు కూల్చేస్తారా.. నేనడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పండి... జంప్ చేయకండి..అమీన్ పూర్పై మాత్రమే మాట్లాడండి... కావూరి హిల్స్ గురించి నేను అడగలేదు ’’
Nalgonda BRS Office: భారత రాష్ట్ర సమితి పార్టీకి హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఆ పార్టీ తరఫున వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. అంతేకాదు.. నల్లగొండ జిల్లాలోని ఆ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని ఆదేశించింది. ఇందుకోసం 15 రోజులు గడువు కూడా విధించింది.
Telangana: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఈరోజు (సోమవారం) హైకోర్టు తీర్పును వెల్లడించనుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని హైకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
Telangana: జన్వాడ ఫామ్‌హౌస్ కూల్చివేతను రేపటి (గురువారం) వరకు చేపట్టవద్దని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. జన్వాడ ఫౌంహౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉండడంతో తమ కట్టడాలను హైడ్రా కూల్చే అవకాశం ఉందని ముందస్తుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. జన్వాడ ఫాంహౌస్‌ను కూల్చవద్దంటూ బీఆర్ఎస్ నేత ప్రవీణ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
Telangana: నగరంలో ఆపరేషన్ హైడ్రా కొనసాగుతూనే ఉంది. అక్రమనిర్మాణాలే లక్ష్యంగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) చెలరేగిపోతోంది. ఎల్టీఎఫ్ పరిధిలో ఉన్న నిర్మాణలపై హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. ఈ క్రమంలో జన్వాడ ఫౌంహౌస్ ఎఫ్ టీ ఎల్ పరిధిలో ఉండడంతో తమ కట్టడాలను హైడ్రా కూల్చే అవకాశం ఉందని ముందస్తుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది.
Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసులో అరెస్ట్ అయిన గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. ఉదయ్ కుమార్ బెయిల్ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ క్రమంలో వివేకా హత్య కేసులో A6 నిందితుడిగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డికి హైకోర్టు ధర్మాసనం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
Telangana: ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి పిటిషన్‌పై ఈరోజు (బుధవారం) హైకోర్టు మరోసారి విచారణ చేయనుంది. ఇటీవల వేణుస్వామి చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదులు వెళ్లగా.. వేణు స్వామికి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మహిళా కమిషన్ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో ఆయన పిటిషన్ వేశారు.
ప్రముఖ జోతిష్యుడు వేణుస్వామి(Venu Swamy) వివాదం తెలంగాణ హైకోర్టు(Telangana High Court)కు చేరింది. ఇటీవల నటుడు అక్కనేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్ధంపై ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. తనకు నోటీసులు ఇవ్వడాన్ని హైకోర్టులో వేణుస్వామి సవాల్ చేశారు.