Home » Telangana Police
నార్సింగి డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. డీజే ప్లేయర్ పెట్టే కార్తికేయ శేఖర్‌తో పాటు మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న నిందితుల్లో ఒకరు ఎయిర్ లైవ్ పబ్ పార్టనర్ విశ్వత్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో కొత్త పోలీసింగ్ విధానానికి రూపకల్పన చేస్తున్నామని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో న్యూ పోలీసింగ్ విధానం తీసుకువస్తామని.. ఇదీ తన లైన్ అని డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు.
ఓ యువతిని ఫేక్ బాబా మోసగించాడు ఈ సంఘటన హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలోని నవాబ్ సాహెబ్ కుంటలో జరిగింది. ఈ కేసుకి సంబంధించిన వివరాలను పాతబస్తీ పోలీసులు వెల్లడించారు.
సైబర్ నేరగాళ్లు చేసే మోసాలపై పోలీసులు, ప్రభుత్వాలు ఎంతగా అవగాహన కల్పిస్తున్న పలువురు బాధితులు మోసపోతునే ఉన్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఓ ఐటీ ఉద్యోగినిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు.
భాగ్యనగరంలో పోలీసులు ఇవాళ(మంగళవారం) తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో లింగంపల్లిలో భారీగా గంజాయిని పట్టుకున్నారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 45 కేజీల గంజాయిని మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు.
మొయినాబాద్‌లో డ్రగ్స్ పార్టీని రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. ఇంటర్‌మీడియట్ చదువుతున్న 50 మందికి పైగా పార్టీలో పాల్గొన్నట్లు సమాచారం.
హనుమకొండలో హైదరాబాద్ యూనిట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఇవాళ(ఆదివారం) సోదాలు నిర్వహించారు. అక్రమంగా అలుగు పొలుసులని (పాంగోలిన్ స్కేల్స్) రవాణా చేస్తున్న నలుగురు నిందితులని అరెస్ట్ చేశారు.
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్‌తో యువత ఉజ్వల భవిష్యత్తు నాశనం అవుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
పాతబస్తీ మాదన్నపేట్‌లో ఏడేళ్ల చిన్నారిని కిరాతకంగా హత్యచేశారు చిన్నారి మేనమామ, అత్త. ఆస్తి పంపకాల విషయంలో చిన్నారి తల్లితో మేనమామ, అత్తకు విభేదాలు ఉన్నాయి. ఇంట్లో అల్లరి చేస్తుందన్న కోపంతో చిన్నారిని దారుణంగా హత్య చేశారు.
డ్రగ్స్‌పై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్‌లో డ్రగ్స్ గ్యాంగుల ఆటకట్టిస్తున్నారు పోలీసులు. నైజీరియా నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి హైదరాబాద్‌లో సప్లై చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.