Home » Telangana
మండలంలోని ఆయా గ్రామాల్లో ఏర్పటు చేసిన పోలింగ్ కేంద్రాలను అదనపు కలెక్టర దీపక్ తివారి శుక్రవారం పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. మండలంలోని గిన్నెధరి, తిర్యాణి మండల కేంద్రంలో కొనసాగుతున్న నామినేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. అనంతరం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది అందించే ఎన్నికల సామగ్రిని కూడా పరిశీలించారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపోటములు నిర్ణయించే శక్తిగా మహిళలు నిలవనున్నారు. మొత్తం ఓటర్లలో పురుషుల కన్నా 28,722 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. దీంతో అభ్యర్థులు అతివల ఓట్లు రాబట్టుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. హోరాహోరీగా సాగనున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో మహిళల ఓట్లు కీలకంగా మారాయి. దీంతో అన్ని పార్టీల అభ్యర్థులు ఆమె ఆశీస్సులపై దృష్టి పెడుతున్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనకు వచ్చారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం తరువాత దాదాపు నాలుగేళ్ళ తరువాత ఇండియాలో పర్యటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ మీ కోసం..
తెలంగాణకు మోదీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని సీఎం రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే ఢిల్లీని ఢీకొడతానని హెచ్చరించారు.
తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిశారు.
హిల్ట్ పాలసీపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. హిల్ట్ పాలసీపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిటిషన్ దాఖలు చేశారు. 9,292 ఎకరాల భూ కేటాయింపుల విషయంలో రూపొందించిన జీఓ నిబంధనలకు విరుద్ధంగా ఉందని తెలిపారు.
రాష్ట్రంలో మూడు లక్షల ఇందిరమ్మ ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. త్వరలో లక్ష ఇళ్లు గృహప్రవేశానికి సిద్ధం అవుతాయని పేర్కొన్నారు.
హైదరాబాద్కు చెందిన పలువురిని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించి లక్షలాది రూపాయలను కొట్టేసిన విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తం రూ.8.24 లక్షలను కొల్లగొట్టారు. తమ ఖాతాల్లో ఉన్న నగదు మాయం కావడంతో ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఎమిరేట్స్ విమానానికి బాంబు బెదిరింపు వ్యవహారం కలకలం రేపుతోంది. శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఎమిరేట్స్ విమానంలో బాంబు పెట్టినట్లు ఆగంతకులు బెదిరించారు.
2026లో లక్ష కోట్ల ప్రభుత్వ ఆస్తులను రక్షించడమే ధ్యేయంగా పనిచేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ... 15 నెలల కాలంలో 60 వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులను, భూములను హైడ్రా రక్షించిందని ఆయన అన్నారు.