Home » Telangana
అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా.. అల్మాస్ గూడలో మంగళవారం ఉదయం నుంచి మొదలుపెట్టిన కూల్చివేతలు ఏకధాటిగా కొనసాగాయి. హైడ్రా కూల్చివేతలతో ప్రజలు భయాందోళలనలు చెందుతున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ప్రశ్నిస్తునే ఉంటానని హరీష్‌రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మోసం, దగా, వంచనకు రేవంత్‌రెడ్డి ఏడాది పాలనే నిలువెత్తు నిదర్శనమని అన్నారు. అధికారం కోసం ప్రజలను మోసగించడం రేవంత్ నైజమని హరీష్‌రావు ఆరోపించారు.
Telangana: ‘‘పెద్దసార్‌తో(కేసీఆర్) ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలకు దూరంగా ఉంటోన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్తో టచ్‌లో ఉన్నారు. కేసీఆర్ ఓకే చెప్తే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకుంటారు’’ అంటూ ఎమ్మెల్యే వివేక్ కామెంట్స్ చేశారు. కొత్త పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తన ఉనికి కోసం ఏదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
Telangana: భాగ్యలత అరుణోదయ కాలనీలో నివసించే కాశీరావును మిత్రుడు శేఖర్ గొంతుకోసి హత్య చేశాడు. స్విగ్గి డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న శేఖర్‌కు కాశీరావు నాలుగు లక్షలు అప్పుగా ఇచ్చాడు. అప్పు తిరిగి ఇవ్వమని శేఖర్ ఫ్లాట్‌కు కాశీరావు వెళ్లాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వివాదం చోటు చేసుకుంది. దీంతో తీవ్ర కోపంతో ఊగిపోయిన శేఖర్.. కాశీరావు గొంతుకోసి అక్కడి నుంచి పరారయ్యాడు.
తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం విషయం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. అయితే ఈ కేసులో మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావుపై కేసు నమోదైంది. పోలీసులు ఈ కేసును సీరియస్‌గా విచారణ చేపట్టారు.
పుష్ప 2 టికెట్ ధరలు పెంపుపై హైకోర్టులో విచారణ జరిగింది. బెనిఫిట్ షో లకు భారీగా టికెట్ ధరలు పెంచారని, సామాన్యులు మూవీ చూసే పరిస్థితి లేదని పిటిషనర్ పేర్కొన్నారు.
Telangana: ములుగు ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో విచారణ కొనసాగింది. పిటిషనర్ తరపున, అలాగే ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. అయితే మృతదేహాలపైన అనేక గాయాలు ఉన్నాయని, ఇదొక బూటకపు ఎన్కౌంటర్ అంటూ పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. భద్రపరిచిన మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించాలని పదే పదే కోరారు.
నగరంలోని కార్ల యజమానులకు టోకరా వేసి లక్షల రూపాయలు కొల్లగొడుతున్న ముఠా ఆటకట్టించారు రాయదుర్గం పోలీసులు(Rayadurgam Police). మహిళా గ్యాంగ్ లీడర్ సహా.. ముఠాలోని నలుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 2.50కోట్ల విలువైన 21 కార్లను స్వాధీనం చేసుకున్నారు.
పార్ట్‌టైం జాబ్ అంటూ నగరవాసిని మభ్యపెట్టిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) పలు దఫాలుగా పెట్టుబడి పెట్టించి రూ.1.65 లక్షలు కాజేశారు. పార్ట్‌టైం ఉద్యోగం కోసం ఆన్లైన్లో వెతికిన నగరానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి (44)ని సైబర్ నేరగాళ్లు సంప్రదించారు.
ఎటువంటి అర్హత లేకున్నా వైద్య చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యుల(Fake doctors) గుట్టు రట్టు చేశారు. వైద్యమండలికి అందిన ఫిర్యాదుల మేరకు సోమవారం తెలంగాణ వైద్య మండలి సభ్యులు డాక్టర్ నరేష్కుమార్, డాక్టర్ ప్రతిభలక్ష్మీ, డాక్టర్ వంశీ కృష్ణ రామంతాపూర్‌లోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.