Home » Telangana
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటుకు కూడా సర్పంచ్ స్థానాలను తారు మారు చేసే శక్తి ఉంటుంది. దీంతో అభ్యర్థులు నాన్ లోకల్ ఓటర్లకు ఫోన్లు చేసి సంప్రదిస్తున్నారు. రెండో విడతలో కౌటాల, చింతలమానేపల్లి, దహెగాం, పెంచికలపేట, సిర్పూర్(టి), బెజ్జూరు మండలాల్లోని 113 పంచాయతీల్లో ఎన్నికలు జరుగున్నాయి.
జిల్లాలో మొదటి విడత ఎన్నికల ప్రక్రియ ఎన్నికల నిబంధనలకు లోబడి నిర్వహించామని జిల్లా ఎన్నికల అధికారి, కుమరం భీం కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లాలోని వాంకిడి మండలం బెండార గ్రామ పంచాయతీలో గురువా రం నిర్వహించిన పోలింగ్ సరళి, కౌంటింగ్ ప్రక్రియలను జిల్లా ఎస్పీ నితికాపంత్, ఎన్నికల పరిశీలకులు శ్రీనివాస్లతో కలిసి పరిశీలించారు.
జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా గురు వారం జరిగిన తొలి విడత ఎన్నికల పోలీంగ్ ప్రశాంతంగా జరిగింది. జైనూరు, కెరమెరి, సిర్పూర్(యూ), లింగాపూర్, వాంకిడి మండాలాల్లోని 114 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటికే ఏడు పంచాయతీలు ఏకగ్రీవం కాగా వాంకిడి మండలంలోని తేజగూడ గ్రామపంచాయతీకి నామినేషన్ దాఖలు కాకపోవడంతో గురువారం 106 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది.
ఓసీపీ-3 ప్రాజెక్టులో నూతనంగా కొనుగోలు చేసిన రెండు మోటార్ గ్రేడర్లను గురువారం జీఎం బండి వెంకటయ్య ప్రారంభించారు. బేస్వర్క్షాప్లో రెండు యంత్రాలకు పూజలు చేసిన అనంతరం వినియోగంలోకి తెచ్చారు.
చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుందని, ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని కార్పొరేట్ సేఫ్టీ జీఎం సాయిబాబు, ఆర్జీ-1 జీఎం లలిత్ కుమార్ అన్నారు.
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని ప్రతీ గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గురువారం మండలంలోని ఖిలావనపర్తి, నర్సింహులపల్లి, దొంగతుర్తి, పైడిచింతలపల్లి, ఖానంపల్లి గ్రామాలలో నిర్వహించిన స్థానిక ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తేనే గ్రామాలు మరింత అభివృద్ధి చెం దుతాయని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. గురువారం అందుగులపల్లిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి అంజయ్య మద్దతుగా గురు వారం ఉదయం ప్రచారం నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో 84.28 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం 45,15,141 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈనెల 13న ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీ హైదరాబాద్ వస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా రాహుల్, ప్రియాంక గాంధీలను ఆహ్వానించినట్లు చెప్పారు.
రహమత్నగర్ ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్లో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం ధాటికి మంటలు ఎగసి పడుతున్నాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.