Home » terror attack
వేంద్ర ఫడ్నవిస్ అధ్యక్షతన మంగళవారంనాడిక్కడ జరిగిన మంత్రివర్గ సమావేశంలో పహల్గాం మృతుల కుటుంబాలకు తొలుత సంతాపం ప్రకటించారు. అనంతరం మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.
సరిహద్దుల వద్ద నిఘా కోసం చిన్న చిన్న డ్రోన్‌లను ఉపయోగించడం, వాటిని కూల్చేసినట్టు ఇరువైపు సైనిక వర్గాలు ప్రకటించుకోవడం రివాజే. అయితే ఈసారి రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా క్షీణించిన క్రమంలో భారత డ్రోన్‌ను కూల్చేసినట్టు పాక్ ఆర్మీ ప్రకటించడం సంచలనమవుతోంది.
Kashmir Tourist Sites Closed: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ కఠిన చర్యలు చేపడుతుండటంతో ఉగ్రవాదులు మరిన్ని దాడులకు ప్లాన్ చేస్తున్నారని నిఘా వర్గాలు భద్రతా హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో 48 పర్యాటక ప్రాంతాలను మూసివేశారు.
ఉగ్రవాదులను ఎదుర్కొవడమంటే ధైర్యంతో కూడుకున్న పని అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. పహల్గాం దాడిలో చాలా దారుణంగా పర్యాటకులను చంపేశారని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
మినీ స్విట్జర్లాండ్‌గా గుర్తింపు పొందిన పహల్గామ్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉగ్రవాదుల దాడి తర్వాత కొన్ని రోజుల పాటు స్థబ్ధగా ఉన్న ఆ ప్రాంతంలో ఆంక్షలను ఎత్తివేశారు. దీంతో మళ్లీ దేశీయులతో పాటు విదేశీ పర్యాటకులు సందడి చేస్తున్నారు.
అణుబాంబులున్నాయంటూ పాక్ నేతలు చేస్తున్న బెదిరింపులను ఒవైసీ తిప్పికొట్టారు. ఒక దేశంలోకి అడుగుపెట్టి అమాయకులను కాల్చి చంపుతుంటే ఏ దేశం కూడా మౌనంగా చూస్తూ ఊరుకోదని అన్నారు.
ఎన్ఐఏ తరఫున సీనియర్ అడ్వకేట్ దయన్ కృష్ణన్, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరేందర్ మాన్ కోర్టుకు హాజరుకాగా, రాణా తరఫున ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి న్యాయవాది పీయూష్ సచ్‌దేవ కోర్టుకు హాజరై తమ వాదనలు వినిపించారు.
పాక్ సైన్యాధిపతి ఆసిం మునీర్ భారత్‌పై విషం కక్కుతూ ఇటీవల రెండు దేశాల సిద్ధాంతాన్ని ప్రస్తావించిన నేపథ్యంలో ఫరూక్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాకిస్తాన్ తీరు మారలేదు, మళ్లీ కాల్పుల విరమణకు పాల్పడింది. ఇదే సమయంలో వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం ఈ దాడిని తిప్పికొట్టింది. అంతేకాదు భవిష్యత్తులో ఇలాంటి దాడులను తిప్పికొట్టేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని చాటి చెప్పింది.
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రవాద దాడి గురించి రోజుకో కొత్త విషయం తెలుస్తోంది. ఈ దాడి వెనుక ఉన్న కుట్రను బయటపెట్టేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) నేతృత్వంలో జరుగుతున్న దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు దాడికి ముందు బిగ్ ప్లాన్ వేశారని వెల్లడించారు.