Home » terrorist
జమ్మూకశ్మీర్లోని దోడా జిల్లాలో జూన్ నుంచి పలు ఉగ్రవాద ఘటనలు చోటుచేసుకోవడం, కొండప్రాంతం జిల్లాలో తిరిగి తీవ్రవాదాన్ని పునరుద్ధరించేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేస్తున్న దుష్పపన్నాగాలపై జమ్మూకశ్మీర్ పోలీసులు మరింత అప్రమత్తమయ్యాయి. టెర్రరిజంపై కొరడా ఝుళిపిస్తూ ముగ్గురు ఉగ్రవాదుల స్కెచ్లను శనివారంనాడు విడుదల చేశారు. వీరి ఆచూకి చెప్పిన వారికి రూ.5 లక్షల చొప్పున రివార్డును ప్రకటించారు.
పవిత్ర అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra)కు ఉగ్ర ముప్పు పొంచి ఉందా. అంటే అవుననే అంటున్నాయి నిఘా వర్గాలు. పవిత్ర యాత్రలో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్కు చెందిన ఐఎస్ఐ (ISI) కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలకు శుక్రవారం సమాచారం అందింది.
బాలీవుడ్ చిత్రం 'ఫాంటమ్' పోస్టర్తో ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ సోమవారంనాడు విడుదల చేసిన ఓ ఆడియోపై జమ్మూకశ్మీర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ వీడియోను ఎవరూ షేర్ చేయవద్దంటూ ప్రజలకు అదేశాలు జారీ చేశారు.
శ్రీనగర్ : భారత్ సరిహద్దుల్లో దాయాది దేశం పాకిస్థాన్ (Pakistan) రెచ్చిపోతోంది. ఎల్ఓసీ (Loc) వెంబడి భారత భూభాగంలోకి దగ్గరుండి మరీ సాయుధ ఉగ్రవాదులను పంపిస్తోంది. వీరికి పాక్ సైనికులు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు తాజాగా వెలుగుచూశాయి.
పీఓకే సరిహద్దులో ఈ మధ్య కాలంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. అయితే ఉగ్రవాద శిబిరాల జాబితాను సిద్ధం చేస్తున్న తరుణంలో భారత ఆర్మీ విచారణలో కీలక విషయాలు బయటకి వచ్చాయి. సరిహద్దులో ఉన్న టెర్రరిస్టు శిబిరాలకు పాకిస్థాన్ ప్రభుత్వం నిధులు సమకూరుస్తున్నట్లు తేలింది.
భారతదేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను భారత దళాలు కాల్చి చంపాయి. ఆదివారం సైనిక దళాలు ....
మణిపూర్లో జిరిబం జిల్లాలోని మాంగ్బంగ్ ప్రాంతంలో ఆదివారం ఉదయం భద్రతా బలగాలపై జరిగిన దాడిలో ఓ సీఆర్పీఎ్ఫ(సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్) జవాన్ మృతి చెందారు.
జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి టెర్రరిస్టుల చొరబాటు యత్నాన్ని భారత ఆర్మీ ఆదివారంనాడు భగ్నం చేసింది. ముగ్గురు టెర్రరిస్టులను మట్టుబెట్టింది. ఘటనా స్థలి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకుంది.
జమ్మూకశ్మీర్లోని కతువా జిల్లా భర్నోటా గ్రామంలో మరోసారి టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఇండియన్ ఆర్మీ వాహనాలను లక్ష్యంగా చేసుకుని సోమవారంనాడు కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు సమర్ధవంతంగా వీటిని తిప్పికొట్టాయి.
కశ్మీర్లో శనివారం జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గాం జిల్లా ఫ్రిసాల్ చిన్నిగాం వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు...