Home » TG Govt
మేడారంలో వనదేవతలు సమ్మక్క - సారలమ్మల గద్దెలు పున: నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. మంత్రులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో గద్దెల పనులపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిశారు.
హిల్ట్ పాలసీపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. హిల్ట్ పాలసీపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిటిషన్ దాఖలు చేశారు. 9,292 ఎకరాల భూ కేటాయింపుల విషయంలో రూపొందించిన జీఓ నిబంధనలకు విరుద్ధంగా ఉందని తెలిపారు.
రాష్ట్రంలో మూడు లక్షల ఇందిరమ్మ ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. త్వరలో లక్ష ఇళ్లు గృహప్రవేశానికి సిద్ధం అవుతాయని పేర్కొన్నారు.
ఇంద్రవెల్లిని పర్యాటక కేంద్రంగా మారుస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే ఆదిలాబాద్కు మళ్లీ వస్తానని.. రోజంతా సమస్యలపై సమీక్షిస్తానని తెలిపారు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్, కమ్యూనికేషన్లో ఆదిలాబాద్ అభివృద్ధి చెందుతోందని వివరించారు.
భూదార్ కార్డులపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. భూదార్ కార్డులు సిద్ధం చేశామని.. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అందజేస్తామని చెప్పుకొచ్చారు.
ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తికావొస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. రెండేళ్ల విజయోత్సవ సభ మొదట మక్తల్లో జరుపుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు.
మేడారం ఆలయ అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆలయ పనులపై జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందిన తెలంగాణను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. భవిష్యత్ కోసం పారదర్శక పాలసీలు తెస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
పంట నష్ట పరిహారం విషయంలో విత్తన ముసాయిదా బిల్లులో స్పష్టత లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వ పక్షాన కేంద్ర ముసాయిదా విత్తన బిల్లుపై అభ్యంతరాలు, సవరణలు గట్టిగానే తెలుపుతామని హెచ్చరించారు.