Home » TG Govt
గోదావరి-కావేరి అనుసంధానంలో భాగంగా ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మాణానికి ఒప్పుకోబోమని తెలంగాణ స్పష్టం చేసింది. అక్కడ రిజర్వాయర్ కడితే సమ్మక్కసాగర్ (తుపాకులగూడెం)పై ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది.
గత ప్రభుత్వ హయాంలో ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్)ను ఓ ప్రైవేటు కంపెనీకి లీజుకు ఇచ్చిన వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వం భూభారతిని అమలు చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో గత పదేళ్ల కాలంలో జరిగిన భూ అవకతవకలు, ఆక్రమణలపై సమగ్ర విచారణ చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉంది.
మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలన్న లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా 10,490 పేద మైనారిటీ మహిళలకు కుట్టుమిషన్లు అందజేయనున్నారు.
అనవసర ఖర్చులు తగ్గించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది. రాబడుల్లో లీకేజీలను నియంత్రిస్తున్న సర్కారు.. తాజాగా కార్యాలయాల నిర్వహణ వ్యయాలపై దృష్టి సారించింది.
వచ్చే నెలలో రైతులందరికీ రైతు భరోసా ఇస్తామని, గతంలో మాదిరిగా రైతులకు అన్ని రకాల పనిముట్లు రాయితీపై అందజేసేలా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు.
సచివాలయంలో ఈ నెల 12నుంచి ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఉదయం 10:30 గంటలలోపు విధులకు హాజరవుతున్నారు.
శేరిలింగంపల్లి.. రాష్ట్రంలోనే అత్యంత ఖరీదైన రెవెన్యూ మండలం. హైదరాబాద్ మహా నగరానికి పశ్చిమాన ఐటీ కారిడార్ను కలిగి ఉన్న ఈ మండలంలో చదరపు గజం విలువ రూ.లక్షల్లోనే..! ఎకరాకు వంద కోట్లు చెల్లించేందుకు ముందుకొస్తే కానీ భూములు, స్థలాలు దొరకవు.
‘‘బీఆర్ఎస్ చేపట్టిన గురుకులాల బాటతో ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కారులో చలనం వచ్చింది. ఇప్పుడు గురుకులాలకు వెళ్తున్నారు. కెమెరాల ముందు హంగామా కాకుండా గురుకులాల బిడ్డల గుండెచప్పుడు వినండి’’ అని మాజీ మంత్రి కేటీఆర్ శనివారం ఎక్స్లో పేర్కొన్నారు.
తెలంగాణ తల్లి విగ్రహం రూపాన్ని ఇష్టం వచ్చినట్లు మార్చడమే కాకుండా.. ఎవరైనా ఇదే విగ్రహం పెట్టాలి.. లేదంటే కేసులు పెడతాం అంటూ రేవంత్ రెడ్డి సర్కార్ రాష్ట్ర ప్రజలను అవమానించేలా జీవో తెచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.