Home » TG Govt
సచివాలయంలో ఈ నెల 12నుంచి ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఉదయం 10:30 గంటలలోపు విధులకు హాజరవుతున్నారు.
శేరిలింగంపల్లి.. రాష్ట్రంలోనే అత్యంత ఖరీదైన రెవెన్యూ మండలం. హైదరాబాద్ మహా నగరానికి పశ్చిమాన ఐటీ కారిడార్‌ను కలిగి ఉన్న ఈ మండలంలో చదరపు గజం విలువ రూ.లక్షల్లోనే..! ఎకరాకు వంద కోట్లు చెల్లించేందుకు ముందుకొస్తే కానీ భూములు, స్థలాలు దొరకవు.
‘‘బీఆర్ఎస్ చేపట్టిన గురుకులాల బాటతో ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కారులో చలనం వచ్చింది. ఇప్పుడు గురుకులాలకు వెళ్తున్నారు. కెమెరాల ముందు హంగామా కాకుండా గురుకులాల బిడ్డల గుండెచప్పుడు వినండి’’ అని మాజీ మంత్రి కేటీఆర్ శనివారం ఎక్స్‌లో పేర్కొన్నారు.
తెలంగాణ తల్లి విగ్రహం రూపాన్ని ఇష్టం వచ్చినట్లు మార్చడమే కాకుండా.. ఎవరైనా ఇదే విగ్రహం పెట్టాలి.. లేదంటే కేసులు పెడతాం అంటూ రేవంత్ రెడ్డి సర్కార్ రాష్ట్ర ప్రజలను అవమానించేలా జీవో తెచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
తెలంగాణ కనీస వేతనాల సలహా మండలిలో సభ్యులను ప్రభుత్వం నియమించింది.
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర అభివృద్ధిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టిపెట్టింది. జాతరకు ముందు తాత్కాలిక సౌకర్యాలు కల్పించే ఆనవాయితీకి ఇక చెక్ పెట్టేసి.. భక్తుల కోసం శాశ్వత ప్రాతిపదికన సౌకర్యాలు కల్పించాలని సంకల్పించింది.
దేశ ప్రధాన నగరాల్లో ఒకటైన హైదరాబాద్‌ను మరింత ప్రగతి పథంలో నడిపించేలా రేవంత్ సర్కార్ ముందుకు వెళ్తుంది. ప్రధానంగా ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా రహదారుల విస్తరణతో పాటు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది.
పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి జారీ చేసిన జీవో-46పై వివరణ ఇవ్వాలని తెలంగాణ సర్కారుకు సోమవారం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే ప్రతి ఇంట్లోని కన్నతల్లిని చూసిన భావన కలుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరికీ అమ్మను చూసిన భావన కలిగేలా విగ్రహాన్ని రూపొందించామని చెప్పారు.
రేపటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి గవర్నర్ నుంచి ఆమోదం లభించింది. దాంతో శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు ఉత్తర్వులను జారీ చేశారు. అసెంబ్లీతో పాటే శాసన మండలి సమావేశాలు కూడా సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.