Home » TG News
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్(Dr. K. Lakshman) అన్నారు. సోమవారం ముషీరాబాద్‌కు చెందిన బీజేపీ ముషీరాబాద్ నియోజకవర్గం(Musheerabad Constituency) జాయింట్ కన్వీనర్ ఎం.నవీన్‌గౌడ్ ఆధ్వర్యంలో ఎంపీ డా.కె.లక్ష్మణ్‌ను కలిసి ముషీరాబాద్(Musheerabad) అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
బెంగళూరు(Bengaluru) నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్న ఇద్దరు డ్రగ్ పెడ్లర్లతో పాటు డ్రగ్స్ కొనుగోలుదారుడిని సౌత్‌వె్‌స్టజోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. అంబర్‌పేట(Amberpet)కు చెందిన సోలోమన్ సుశాయిరాజ్(33) డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు.
మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్నారుల నుంచి పండు ముసలి వరకు మృగాళ్లు మహిళలపై లైంగిక దాడులకు తెగబడుతున్నారు. పోలీసులు మహిళా భద్రతకు పెద్దపీట వేస్తున్నా.. షీటీమ్స్(Shee teams)ను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ పోకిరీల భరతం పడుతున్నా.. అరాచకాలు, అత్యాచారాలు మాత్రం తగ్గడంలేదు.
క్రిస్మస్, మహాకుంభ మేళా(Christmas, Mahakumbh Mela) పండుగలను పురస్కరించుకొని వివిధ ప్రదేశాలకు 12 ప్రత్యేకరైళ్లను నడపుతున్నట్లు దక్షిణమధ్యరైల్వే సీపీఆర్ఓ శ్రీధర్(South Central Railway CPRO Sridhar) తెలిపారు.
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ(Online food delivery) సంస్థ ఈ ఏడాది తమ ప్లాట్‌ఫామ్‌పై భారతీయులు ఏ విధంగా ఫుడ్‌ను శోధించారో తెలుపుతూ 9వ ఎడిషన్ నివేదికను ‘హౌ ఇండియా స్విగ్గీడ్’ శీర్షికన విడుదల చేసింది. ఈ ఏడాది 8.3 కోట్ల(83 మిలియన్) బిర్యానీలను స్విగ్గీలో ఆర్డర్ చేశారు.
యువకుడి హత్య కేసును 48 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. తండ్రీకొడుకులే సూత్రధారులని నిర్ధారించి వారిని అరెస్ట్ చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నార్త్‌జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్, ఏసీపీ గోపాలకృష్ణమూర్తి వివరాలు వెల్లడించారు.
వ్యవసాయం కోసం చేసిన అప్పులు పెరిగిపోయి.. .జీవితంపై విరక్తితో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం రామాయిపల్లిలో రైతు బత్తుల రాజు (40) అప్పులు చేసి బోర్లు వేయగా ఫలితం దక్కలేదు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట మండలంలోని కొండపల్లి, ఎర్రగుట్ట, పోతెపల్లి, దర్గపల్లి, లోడ్పల్లి గ్రామాల్లోని అటవీ ప్రాంతాల్లో సోమవారం పులి కదలికలు కలకలం రేపాయి.
బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతూ దాతల సాయంతో ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్న తన కుమారుడు ఇప్పుడు డిశ్చార్చి అయ్యేందుకు దాతలు సహకరించాలని ఓ తల్లి కోరారు.
దేశవ్యాప్తంగా బొగ్గు రంగంలో వస్తున్న సవాళ్లను అధిగమించి సింగరేణి సంస్థను ప్రగతిపథంలో నడిపిస్తామని ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం విశ్వాసం వ్యక్తం చేశారు.