Home » TG News
తెలుగు భాషలో నాలుగేళ్ల డిప్లొమా కోర్సును నిర్వహించడానికి మలేషియా తెలుగు సంఘం(Malaysian Telugu Association), తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంతో విద్యాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
నగరం ముసురేసింది. రోజంతా కురుస్తున్న ముసురు, చిరుజల్లులతో ప్రజలు తడిసి ముద్దయ్యారు. దీంతో గురువారం వాతావరణం పూర్తిగా మారిపోయింది. చిరుజల్లులతో రహదారులు బురదమయంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
హత్య చేసి.. డెడ్‌బాడీని గోనెసంచిలో కట్టి రోడ్డు పక్కన వేసిన కేసు మిస్టరీ వీడింది. కట్టుకున్న భార్యే హత్య చేసినట్లు తేలింది. తాగివచ్చి వేధిస్తున్నాడని సోదరి సాయంతో ఉరేసి చంపేసింది.
కేంద్ర ప్రభుత్వం 2023-24 సంవత్సరం యాసంగి సీజన్‌కు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) గడువును పెంచింది.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణ వార్త తనను తీవ్రంగా కలచివేసిందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నిష్కళంకమైన పాలన, అత్యున్నత మానవతావాది అయిన మన్మోహన్ సింగ్ ఆధునిక భారతదేశానికి నిజమైన వాస్తుశిల్పుల్లో ఒకరని కొనియాడారు.
600 ప్రొబేషనరీ ఆఫీసర్(పీవో) పోస్టుల నియామకానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎ్‌సబీఐ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అభ్యర్థులను ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు.
బీఆర్ఎస్ నేత, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివా్‌సను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసులు వెస్ట్ మారేడ్‌పల్లిలోని శ్రీనివాస్ నివాసానికి తెల్లవారుజామునే వెళ్లి కాలింగ్ బెల్ కొట్టినా ఆయన చాలాసేపటి వరకు తెరవలేదు.
దేవాదాయ శాఖలో సీనియారిటీ వ్యవహారం దైవాధీనంగా మారింది. ఈ విషయమై హైకోర్టు ఆదేశాలిచ్చి 9 నెలలైనా.. సీనియారిటీని ఖరారు చేసేవారే కరువయ్యారు.
తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీజీఐఐసీ)కు ఐసీఐసీఐ బ్యాంకు రూ.10వేల కోట్ల అప్పును మంజూరు చేసింది.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రం (స్వాతి) పురస్కరించుకుని గురువారం గిరి ప్రదక్షిణ చేపట్టారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన సుమారు 10 వేల మంది భక్తులు పాల్గొన్నారు.