Home » TG News
నేటి రాజకీయాల్లో నైతిక విలువలు అంతరించిపోతున్నాయని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య అన్నారు. రాజకీయ నాయకులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొందని, గతంలో ఈ పద్ధతి ఉండేది కాదని పేర్కొన్నారు.
ఫార్ములా ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సమన్లు జారీ చేశారు.
రాష్ట్రానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎ్‌ఫడీఐ) ప్రవాహం గణనీయంగా పెరిగింది. 2024 ఏప్రిల్ నుంచి సెప్టెంబరు మధ్య ఆరు నెలల కాలంలో రాష్ట్రానికి రూ. 12,864 కోట్లు వచ్చాయి.
పేద ప్రజలకు అన్ని వేళలా అండగా నిలిచిన వ్యక్తి దివంగత మాజీ మంత్రి పి.జనార్దన్ రెడ్డి అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.
తెలంగాణకు భారీ పెట్టుబడులే లక్ష్యంగా వచ్చే నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన చేయనున్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం నేపథ్యంలో ఈ నెల 30న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది.
రంగారెడ్డి జిల్లా కందుకూరు, యాచారం మండలాల్లో గ్రీన్ ఫార్మా విలేజీ ఏర్పాటు కోసం స్థలాలిచ్చిన రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
‘ఈ బువ్వ తినుడు వశమైతలేదే.. ఓ రోజు మాడిన అన్నం పెట్టిన్రు.. ఇంకో రోజు అన్నంలో పురుగులు వచ్చాయి. భయమైతాంది. నన్ను ఇంటికి తీసుకుపో’.. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లోని కేజీబీవీ పాఠశాల విద్యార్థులు ఇటీవల తమ తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడుతున్న మాటలివి.
గోదావరి-కావేరీ అనుసంధానం తొలి దశ కింద తరలించే నీటిలో 50 శాతాన్ని(74 టీఎంసీలను) కేటాయించాలన్న తెలంగాణ డిమాండ్‌ను కేంద్రం తోసిపుచ్చింది.
రిజిస్ట్రేషన్ శాఖకు శనివారం కాసుల వర్షం కురిసింది. రోజూ వారీ కంటే రెట్టింపు సంఖ్యలో డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కావడంతో సమృద్ధిగా ఆదాయం సమకూరింది.