Home » TG News
అక్రమ కట్డడాలపై ఓవైపు హైడ్రా కొరడా ఝుళిపిస్తున్నా, అనుమతుల్లేని నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నా.. ఈ తరహా నిర్మాణాలు చేపట్టేవారు ఏమాత్రం వెనకాడటంలేదు.
‘‘కాంగ్రెస్ పార్టీలో బీసీల సమస్యలపై గొంతెత్తే స్వేచ్ఛ పార్టీలోని బీసీ నేతలందరికీ ఉంది. బీఆర్ఎస్ లోని బీసీ నేతలకు బీసీల గురించి గొంతెత్తే ధైర్యం ఉందా?’’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.
సీఎం క్యాంపు ఆఫీసులో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం ఉత్త ప్రహసనంగా మారిందని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు.
గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు గురుకుల ఉపాధ్యాయుల(సీఆర్టీ)తో మంత్రి సీతక్క చర్చలు సఫలం కావడంతో 16 రోజులుగా సమ్మె చేస్తున్న వారు సమ్మె విరమించినట్టు ప్రకటించారు.
శంషాబాద్ ఎయిర్పోర్టులో సీబీఐ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. కస్టమ్స్ క్లియరెన్స్ కోసం విదేశీ ప్రయాణికుల నుంచి లంచం డిమాండ్ చేస్తున్నారన్న ఫిర్యాదుల నేపఽథ్యంలో సీబీఐ రంగంలోకి దిగింది.
‘‘అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ను అమలు చేయాలి. బీసీలకు 42ు రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిచాలి.
ఫార్ములా-ఈ కారు రేసు కేసులో నిందితుల విచారణకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సన్నద్ధమైంది. ఈ కేసులో ఏ1గా ఉన్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్కు శుక్రవారం నోటీసు జారీ చేసింది. ఈనెల ఆరో తేదీ ఉదయం పది గంటలకు విచారణకు రావాలని పేర్కొంది.
Drinking water supply: భాగ్యనగరంలో 48 గంటల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు అధికారులు (HMWSSB) తెలిపారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో జనవరి 6, 7 తేదీల్లో రెండు రోజుల పాటు తాగునీటి సరఫరా ఉండదని అధికారులు చెప్పారు.
CM Revanth Reddy: గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం పరిపాలన వ్యవస్థను భ్రష్టు పట్టించిందని సీఎం రేవంత్రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిపాలన వ్యవస్థను పునరుద్ధరించే ప్రయత్నం చేశామని ఉద్ఘాటించారు..
అమెరికా కాదు ఏ దేశం వెళ్లినా అక్కడ తెలుగు వారు ఉన్నారని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమెరికాకు ఏడాదిలోనే 1.5 లక్షల మంది వరకు తెలుగు వారు చదువుకునేందుకు వెళ్లారని చెప్పారు. అవకాశాల కోసం విదేశాలకు వెళ్లడంలో తప్పులేదని.. కానీ. మాతృదేశాన్ని మర్చిపోకూడదని సీఎం చంద్రబాబు తెలిపారు.