Home » TG News
శాసనసభ ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ.. గత ఏడాది ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో ఘనంగా ఓట్లను పొందినా సగం సీట్లనే కైవసం చేసుకోగలిగింది.
నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి ఫైనాన్సియర్స్ ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించిందన్న కేసులో కౌంటర్ అఫిడవిట్లు దాఖ లు చేయనందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై శుక్రవారం తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల(ఎ్‌సహెచ్‌జీ) ఆధ్వర్యంలో మొట్టమొదటి మహిళా పెట్రోల్ బంకును సంగారెడ్డిలో ఏర్పాటు చేస్తుండటం ఆనందంగా ఉందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.
వ్యవసాయశాఖలో ఏళ్ల తరబడి వాయిదా పడుతూ వస్తున్న పదోన్నతుల ప్రక్రియను సంక్రాంతిలోపు పూర్తిచేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.
‘‘మీరు ఒక సారి పరీక్ష రాస్తే.. 35 ఏళ్లు ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటారు.. మేం మాత్రం ప్రతి ఐదేళ్లకు ఒకసారి పరీక్ష రాయాలి. రాష్ట్రానికి వారధులైనా.. సారథులైనా మీరే’’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
దశాబ్దాలుగా ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న మున్నేరు వాగు వరద ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు జూలై 15 నాటికి రిటైనింగ్ వాల్స్ పనులు పూర్తిచేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు.
రానున్న రోజుల్లో హరిత హైడ్రోజన్ హబ్‌గా తెలంగాణను మారుస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శనివారం సాయంత్రం 4గంటలకు సచివాలయంలోని క్యాబినెట్ హాలులో జరగనుంది. ఈ సందర్భంగా ప్రధానంగా రైతు భరోసా అమలుపై చర్చ జరిగే అవకాశాలున్నాయి.
హైదరాబాద్ మహా నగరానికి తాగునీటి అవసరాలకు నిర్దేశించిన గోదావరి ఫేజ్-2 ప్రాజెక్టుకు గోదావరి జలాలను మల్లన్న సాగర్ నుంచి తీసుకోవాలా? కొండపోచమ్మ సాగర్ నుంచి తీసుకోవాలా? అనే సందిగ్ధానికి తెరపడింది.
అక్రమ కట్డడాలపై ఓవైపు హైడ్రా కొరడా ఝుళిపిస్తున్నా, అనుమతుల్లేని నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నా.. ఈ తరహా నిర్మాణాలు చేపట్టేవారు ఏమాత్రం వెనకాడటంలేదు.