Home » TG Politics
మేడిగడ్డ మూడు పిల్లర్లు కుంగితే రేవంత్‌రెడ్డి సర్కార్ రాద్ధాంతం చేస్తోందని మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజమెత్తారు. ఏడాదిన్నర నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. వానాకాలంలో విద్యుత్ డిమాండ్ ఉండదని హరీష్‌రావు చెప్పుకొచ్చారు.
నల్లగొండ పాతబస్తీ ఒకటో నంబర్ వినాయకుడి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రసంగిస్తుండగా బీజేపీ నేతలు అడ్డుకున్నారు. గణేష్ ఉత్సవాల్లో రాజకీయాలు మాట్లాడటమేంటని బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో మాజీ మంత్రి కేటీఆర్ సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నారు. గత నాలుగు రోజులుగా ఎర్రవల్లి ఫాంహౌస్‌లోనే కేటీఆర్ ఉన్నారు. పలు కీలక విషయాలపై కేసీఆర్‌తో చర్చిస్తున్నారు.
కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తే.. తలదించుకోవాల్సింది సీఎం రేవంతే అని జగదీష్ రెడ్డి విమర్శించారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్సే అని ఉద్ఘాటించారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పార్టీలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో పార్టీ నేతలతో కేసీఆర్ మరోసారి భేటీ అయ్యారు. కవిత సస్పెన్షన్ తదననంతర పరిణామాలపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం.
కవిత బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, సంతోష్ రావులపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. బీఆర్ఎస్‌లో సునామీ సృష్టించిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
కవిత కామెంట్స్‌పై బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కవిత కామెంట్స్ తర్వాత ఫాంహౌస్‌లో కేసీఆర్‌తో కేటీఆర్, మధుసూదనాచారీ, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వరరరెడ్డి సమావేశమైనట్లు సమాచారం.
ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, సంతోష్ రావులపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రమంత దుమారం రేపుతున్నా్యి. ఈ నేపథ్యంలో కవిత కామెంట్స్‌పై బీఆర్ఎస్ స్పందించింది.
కాళేశ్వరంపై బీజేపీ వైఖరే నిజమని మరోసారి రుజువైందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఉద్ఘాటించారు. కాళేశ్వరం అవినీతికి బీఆర్ఎస్ పూర్తి బాధ్యత వహించాలని బండి సంజయ్ కోరారు.
కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను లక్ష కోట్లకు పెంచారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అసెంబ్లీలో పెట్టొద్దని, చర్చ చేయొద్దని హైకోర్టుకు వెళ్లి చేయాల్సింది అంతా మీరే చేశారని మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.