Home » TG Politics
విపత్కర సరిస్థితుల్లో బీఆర్ఎస్ నేతలు రాజకీయాలు చేయొద్దని మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ (Sampath Kumar) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. భారీ వర్షాలతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా 24×7 తమ ప్రభుత్వం, కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు రాజకీయ లబ్ధికోసం విచక్షణలేకుండా మాట్లాడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అర్ధరాత్రి అండర్‌గ్రౌండ్ కేబుల్(Underground cable) చోరీ చేసిన ముఠా సభ్యులు 14 మందిని బోయినపల్లి పోలీసులు(Boinapally Police) అరెస్ట్ చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నార్త్‌జోన్ డీసీపీ రేష్మి పెరుమాల్(North Zone DCP Reshmi Perumal) వివరాలు వెల్లడించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో ప్రజల్ని మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు ప్రజల్ని వంచించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టుందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం– జనసేన–బీజేపీ కూటమికి చెందిన మంత్రులు, శాసనసభ్యులు, నాయకులకు ఒక సూచన.. కాదు ఒక హెచ్చరిక కూడా! నిన్నటి జగన్ అండ్ కో అరాచక పాలనను...
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని కాంగ్రెస్ సర్కార్ అస్తవ్యస్తం చేసిందని బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక విద్యార్థులు లేరంటూ 1,864 ప్రభుత్వ పాఠశాలలు మూసేసే కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) చెప్పారు. పేద, మధ్య తరగతి విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు.
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇవాళ(శనివారం) రాజకీయ పార్టీల నేతలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. మాసబ్‌ట్యాంక్‌లోని ఎన్నికల కమిషన్ కార్యాలయంలో మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే సమావేశానికి గుర్తింపు పొందిన పలు పార్టీల ప్రతినిధులు హాజరుకానున్నారు.
లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)కు సుప్రీంకోర్టు(Supreme Court) బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో కవితకు ఈడీ కేసులో ఊరట లభించింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) బెయిల్ పిటిషన్‌పై ఇన్నాళ్లు నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మితమవుతుందని, కానీ కాంగ్రెస్ పాలనలో విద్యార్థులు చదువుకు నోచుకోని పరిస్థితి దాపురించిందని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. తెలంగాణలో గిరిజన బిడ్డలు అధికంగా నివసించే ప్రాంతాల్లో ఉపాధ్యాయులు లేరన్న సాకు చూపి 43 ప్రభుత్వ పాఠశాలలు మూసివేయడం కాంగ్రెస్ చేతకాని పాలనకు నిదర్శనమంటూ ఆయన ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ.. పక్క రాష్ట్రం తెలంగాణలో పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.