Home » TGSRTC
TGSRTC: పండుగ వేళ ప్రయాణికులకు షాకింగ్ న్యూస్ చెప్పింది టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం. దసరా వేళ స్పెషల్ బస్సుల పేరుతో ప్రయాణికుల జేబులకు చిల్లు పెట్టేందుకు సిద్ధమైంది. దసరా రద్దీ దృష్ట్యా స్పెషల్ బస్సులు నడుపుతున్నామని ప్రకటించిన ఆర్టీసీ.. ఆ బస్సుల్లో ప్రత్యేక ఛార్జీలు ఉంటాయని స్పష్టం చేసింది.
సద్దుల బతుకమ్మ, దసరాకు 6,304 ప్రత్యేక బస్సులను జిల్లాలకు నడుపుతున్నామని, స్పెషల్ ఆపరేషన్స్‌కు పోలీస్, రవాణా శాఖల అధికారులు సహకరించాలని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్(TGS RTC MD VC Sajjanar) కోరారు.
త్వరలో టీజీఎస్ ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలంగాణ రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అందుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుందన్నారు. సంస్థలో మిగిలిన ఖాళీలను సైతం భర్తీ చేస్తామని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజా అవసరాలకు అనుగుణంగా నూతన ఆర్టీసీ బస్సుల కొనుగోలుకు రంగం సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు.
ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్(Congress) విస్మరించిందని ఆర్టీసీ జేఏసీ(RTC JAC) నేతలు విమర్శించారు.
సోమవారం ఉదయం గద్వాల్ డిపోకు చెందిన గద్వాల్ - వనపర్తి రూట్లో పల్లె వెలుగు బస్సులో నిండు గర్బిణీ సంధ్య.. రక్ష బంధన్ సందర్భంగా సోదరులతో రాఖీ కట్టించుకునేందుకు వనపర్తికి బయలుదేరింది. బస్సు నాచుపల్లి సమీపంలోకి రాగానే ఆమెకు నొప్పులు తీవ్రమయ్యాయి. బస్సు కండక్టర్ జి. భారతీ వెంటనే స్పందించారు. బస్సును పక్కకు ఆపి.. మిగిలిన ప్రయాణికులకు దింపేశారు అదే బస్సులో ప్రయాణిస్తున్న నర్సు సహాయంతో సంధ్యకు పురుడు పోశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్(Hyderabad, Secunderabad) జంటనగరాల పరిధిలో 24 సరికొత్త మెట్రో డీలక్స్ బస్సులను(Metro deluxe buses) అందుబాటులోకి తీసుకొచ్చినట్లు గ్రేటర్ హైదరాబాద్ ఈడీ వి.వెంకటేశ్వర్లు(Greater Hyderabad ED V.Venkateshwarlu) తెలిపారు.
కొత్త బస్సులు వచ్చాయని, త్వరలో 5 రూట్లలో 10 మెట్రో డీలక్స్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని హైదరాబాద్ రీజియన్ రీజినల్ మేనేజర్ బి.వరప్రసాద్(Hyderabad Region Regional Manager B. Varaprasad) తెలిపారు. మహాలక్ష్మి పథకంతో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, రద్దీ సమయాల్లో 110 శాతం ఆక్యుపెన్సీ నమోదవుతున్నదని వివరించారు.
కొత్తగా 282కే, 215 రూట్లలో ఘట్కేసర్, రాజేంద్రనగర్ ప్రాంతాల నుంచి కొండాపూర్(Kondapur)కు గురువారం నుంచి బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తోంది. కాచిగూడ డిపోకు చెందిన రెండు మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులను ఘట్కేసర్ నుంచి కొండాపూర్‌కు, రాజేంద్రనగర్ డిపో నుంచి రెండు ఆర్డినరీ బస్సులను 215 రూట్లో రాజేంద్రనగర్ నుంచి అరాంఘర్ మీదుగా కొండాపూర్‌కు రెండు సర్వీసులు నడపనున్నారు.
గ్రేటర్లో మళ్లీ మెట్రో డీలక్స్ బస్సులు(Metro Deluxe Buses) అందుబాటులోకి రాబోతున్నాయి. ఎలక్ట్రిక్ బస్సుల(Electric buses) రాక ఆలస్యంతో ప్రత్యామ్నాయ చర్యలపై ఆర్టీసీ దృష్టిసారించింది. గ్రేటర్ జోన్ పరిధిలో సెప్టెంబర్ నాటికి 300 మెట్రో డీలక్స్ బస్సులు రోడ్లపైకి తీసుకువచ్చే లక్ష్యంతో ప్రత్యేక నిధులు కేటాయించాలంటూ ప్రభుత్వానికి ఆర్టీసీ ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది.