Home » TGSRTC
ఆర్టీసీ కండక్టర్లకు ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి వేధింపులు ఎక్కువవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. వారికి రోజువారీ టార్గెట్లను విధిస్తున్నారు. దీంతో ఆ లక్ష్యాన్ని చేరుకోలేక కండక్టర్లు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఓపక్క బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, సిటీలో బస్ పాస్లుండటంతో లక్ష్య చేధన తలకు మించిన భారంగా మారింది.
TGSRTC Tampering Case: తెలంగాణ ఆర్టీసీలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. గత అక్డోబర్‌లో సరైన పత్రాలు లేవని ఓ బోరుబండిని పోలీసులు సీజ్ చేశారు. ఆ తర్వాత ఆ బండిలోని ఇంజిన్, ఛాసిన్ నంబర్లను సదరు యాజమాని మార్చినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఆర్టీసీ సిబ్బందిపై పలు ఆరోపణలు వచ్చాయి. ఆర్టీసీ సిబ్బంది కాసుల కోసం కక్కుర్తి పడి ఈ వ్యవహారం నడిపించినట్లు ఆరోపణలు వచ్చాయి.
సరస్వతీ నది పుష్కరాలకు హైదరాబాద్ నగరం నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. బుధవారం నుంచి జేబీఎస్, ఎంజీబీఎస్ల నుంచి కాళేశ్వరానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అంతేగాక 40 మంది ప్రయాణికులుంటే ఆ కాలనీకే బస్సు పంపిస్తామన్నామని అధికారులు తెలిపారు.
TGSRTC Strike Postponed : ఆర్టీసీ కార్మికులతో తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. రేపటి నుంచి జరగాల్సిన తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె వాయిదా పడింది.
Minister Ponnam Prabhakar: ఆర్టీసీ సమ్మెతో ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని మంత్రి పొన్నం ప్రబాకర్ అన్నారు. కార్మికులు సమ్మెను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో సమస్యల పరిష్కారం కోసం జేఏసీ బుధవారం నుంచి సమ్మెలోకి దిగుతోంది. సమ్మెను విజయవంతం చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సన్నాహక కార్యక్రమాలు చేపట్టింది.
Minister Ponnam Prabhakar : ఆర్టీసీ సమస్యలు పరిష్కరించడానికి తాను, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తమ ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల కోసం చాలా కార్యక్రమాలు చేపట్టామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
టీజీఎస్ఆర్టీసీ కార్మికులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రయాణికులు, డ్రైవర్లు, కండక్టర్లతో మాట్లాడారు.
ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన సమ్మె పిలుపును విరమింపజేసేందుకు ప్రభు త్వం సమాలోచనలు చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
హైదరాబాద్ నగరంలో మరో 200 కొత్త బస్సులు నడిపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. వీటిలో దాదాపు 150 ఎలక్ర్టిక్ బస్సులు ఉండనున్నాయి తెలుస్తో్ంది. ఇప్పటికే నగర వ్యాప్తంగా ఎలక్ర్టిక్ బస్సులు తిరుగుతుండగా మరోకొన్ని కూడా వస్తే ఇక.. ప్రయాణికులకు ఇబ్బందులు తప్పనున్నాయి.