Home » Thummala Nageswara Rao
తెలంగాణలో ఆయిల్ పామ్ సాగుకు 31 జిల్లాల్లో అనుమతులు ఉన్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆయిల్ ఫెడ్‌తో పాటు 14 ప్రైవేట్ కంపెనీలకు ఆయిల్ పామ్ సాగు విస్తరణ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు.
రాష్ట్రంలో అగ్రి ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు పెట్టుబడులు పెట్టడానికి ముందుకురావాలని మలేషియా దేశ వ్యవసాయ మంత్రి మహ్మద్ బిన్ సాబుకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో సొంతంగా సీడ్ గార్డెన్‌ను ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని, అందుకు ఎఫ్‌జీవీ కంపెనీ సహకారం కూడా కావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.
ఆయిల్‌పామ్ పరిశ్రమ అభివృద్ధికి రానున్నకాలంలో ఆయిల్‌పామ్ సాగులో అగ్రగామి ఉన్న దేశాల్లో ఒకటైన మలేషియా సహకారం తీసుకోనున్నట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మలేషియా పర్యటనకు వెళ్లారు.
సాగులో లేని భూములకు కూడా రైతుబంధు ఇచ్చి రూ.25వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసిన ఖ్యాతి మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు.
రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన ప్రకటనతో తెలంగాణ వ్యాప్తంగా రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఆందోళనలు చేస్తున్నారు.
బీఆర్ఎస్ ధర్నాలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎద్దేవా చేశారు. రైతు సంక్షేమం కోసం బీఆర్ఎస్ నేతలు రాజకీయాలు చేయకుండా.. నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. వరంగల్ రైతు డిక్లరేషన్ మీటింగ్‌లో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని అమలు చేయడంలో ఎక్కడ రాజీపడలేదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో సాగు భూములకే రైతు భరోసా పథకం అమలు చేస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ పుట్టిన రోజు (డిసెంబరు 9) నాటికి ప్రతీ రైతుకు రూ.2లక్షల రుణ మాఫీని పూర్తి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.