Home » Tirumala
వేసవి సెలవులు చివరికి చేరుకోవడంతో తిరుమలకొండకు భక్తులు పోటెత్తారు. గురువారం నుంచే ఎటు చూసినా జనం కనిపిస్తున్నారు.
తిరుమల అభివృద్ధిని ప్రణాళికబద్ధంగా కొనసాగిస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. టౌన్‌ప్లానింగ్ విభాగం ఏర్పాటు చేసి ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
తిరుమల (Tirumala) తిరుపతి దేవస్థానం, భక్తుల సౌకర్యం, ఆలయ నిర్వహణలో పారదర్శకత, సామర్థ్యం కోసం అనేక సంస్కరణలను అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు సూచనల మేరకు గత 11 నెలల కాలంలో తిరుమలలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్లు ఈవో శ్యామలరావు తెలిపారు.
తిరుమలలో మద్యం మత్తులో కర్నూలు ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు అవినీతి ప్రదర్శించారు. వీరిపై సస్పెన్షన్ జారీ చేసి, వారి ఇన్చార్జికి చార్జిమో కూడా జారీ చేశారు.
Tirumala: తిరుమలలో అన్యమతస్థుడు బహిరంగంగానే నమాజ్ చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. నిత్యం స్వామివారి చెంత కళ్యాణం చేసుకుని వచ్చే భక్తులతో కళ్యాణ వేదిక ప్రాంతం కిటకిటలాడుతూ ఉంటుంది.
తిరుమలలో తరచూ భద్రతా వైఫల్యాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో నాలుగు నెలలు ఆలస్యంగానైనా ప్రభుత్వం టీటీడీకి రెగ్యులర్ సీవీఎస్వోను నియమించింది. విశాఖపట్నంలో ఏపీఎస్పీ 16వ బెటాలియన్ కమాండెంట్‌గా పనిచేస్తున్న మురళీకృష్ణను టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా బదిలీ చేసింది.
‘టీటీడీ గోశాలలో ప్రతినెలా 14వరకు గోవులు చనిపోతున్నాయని ఇప్పటికే గుర్తించాం. వంద గోవులు ఆసాధారణంగా చనిపోయాయంటూ చేసిన ప్రచారంలో వాస్తవాలు లేవు. త్వరలో మంచి ఫలితాలను అందరూ చూస్తారు’ అని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు.
తిరుమల శ్రీవారికి మైసూరు రాజమాత ప్రమోదా దేవి 50 కిలోల బరువు ఉన్న రెండు వెండి అఖండ దీపాలను విరాళంగా అందజేశారు. 300 ఏళ్ల క్రితం మైసూరు మహారాజు సమర్పించిన దీపాలు పాడైపోవడంతో, వాటి స్థానంలో ఈ కొత్త దీపాలను అందించారు.
తిరుమల శ్రీవారికి మైసూరు రాజమాత ప్రమోదా దేవి రెండు భారీ వెండి అఖండ దీపాలను సోమవారం విరాళంగా అందజేశారు.
తిరుమల వేంకటేశ్వర స్వామి సేవ కోసం కోర్టు మెట్లు ఎక్కిన దంపతులు చివరకు విజయం సాధించారు. దాదాపు 17 ఏళ్ల పాటు కోర్టులో పోరాడి సేవా టికెట్ల ను పొందారు.