Home » Tirumala
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలతో తిరుమల కొండ శోభాయమానంగా దర్శనమిస్తోంది.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిధిలోని పరకామణి విభాగంలో జరిగిన భారీ చోరీపై టీటీడీ సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఒక వీడియోను విడుదల చేసిన ఆయన..
బ్రహ్మోత్సవాలలో సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు, గదులు రద్దు చేశామని.. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఈవో వివరించారు. బ్రహ్మోత్సవాల తొమ్మిది రోజులకు 1.16 లక్షల రూపాయల ప్రత్యేక దర్శన టిక్కెట్లను భక్తులకు విక్రయించామని తెలిపారు.
టీటీడీ అన్నప్రసాదం నాణ్యత, రుచులపై ప్రపంచవ్యాప్తంగా భక్తుల నుంచి వస్తున్న స్పందన కారణంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో ట్రస్టు కార్పస్ నిధులు చాలా బాగా పెరిగాయని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమలలోని వెంగమాంబ అన్నప్రసాద భవనంలో గురువారం సాయంత్రం ఆయన తనిఖీలు చేపట్టారు.
టీటీడీ సమావేశంలో పలు కీలక విషయాలపై నిర్ణయం తీసుకోనుంది. శ్రీవారి నిధులతో పలు ప్రాంతాల్లో ఆలయ నిర్మాణాలకు నిధులు కేటాయింపుపై పాలకమండలి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్న నిర్మలా సీతారామన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
అన్నప్రసాదాలకు కూరగాయలు విరాళంగా టీటీడీ(TTD)కి అందజేస్తున్న దాతలతో ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సూచించారు. కూరగాలయ దాతలతో బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఆయన సమావేశమయ్యారు.
చంద్రగ్రహణం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆదివారం పలు ఆలయాలను మూసివేయనున్నారు. తిరిగి సోమవారం దేవస్థానాల సంప్రోక్షణ అనంతరం తెరుస్తామని ఆలయాల అధికారులు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఆలయాల అధికారులు పేర్కొన్నారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది.ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారికి గద్వాల ఏరువాడ జోడు పంచెలు కానుకగా అందాయి.
తిరుమల ఆలయాన్ని 7(శనివారం)వ తేదీ మధ్యాహ్నం 3.30గంటల నుంచి ఆదివారం వేకువజామున 3 గంటల వరకు మూసివేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ మేరకు 7వ తేదీ పలు ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు పేర్కొంది.