Home » Tirupathi News
ప్రకృతి వైపరీత్యాలను సమర్ధవంతంగా ఎదుర్కొని ప్రజలకు సీఎం చంద్రబాబు ఉత్తమ పాలన అందించారని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ తెలిపారు. వరదల్లో చనిపోయిన బాధిత కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున చేయూతనిచ్చారని అన్నారు
తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో తిరుమలకు నెయ్యి సరఫరా చేసే నాలుగు కంపెనీలకు చెందిన నమూనాలు సేకరించింది.
తిరుమల లడ్డూ కల్తీపై వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను మాత్రం ఎలాంటి తప్పు చేయలేదని.. ఎలాంటి విచారణకైనా సిద్ధమని కరుణాకర్ రెడ్డి అన్నారు.
వేంకటేశ్వర స్వామి వారి ఆస్తులను గత పాలక మండళ్లకు నేతృత్వం వహించినవారు కాపాడారా? వాటిని అమ్మేశారా? అనే సందేహాలు భక్తులకు వస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుమల శ్రీవారి ఆస్తులను పరిరక్షించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు.
తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యి కల్తీపై ఐజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. అమరావతిలో ఆదివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు.
గత జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కోవ్వు వాడినట్లు నిర్థారణ కావడంతో.. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్, గత టీటీడీ చైర్మన్‌తోపాటు పాలక మండలి సభ్యులపై హైదరాబాద్‌లోని సైదాబాద్ పోలీస్ స్టేషన్లో హైకోర్టు న్యాయవాది ఫిర్యాదు చేశారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ అయ్యినట్టు నిర్ధారణ కావడంతో స్వామివారి భక్తులు, హిందూ ధార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
అలిపిరికి చెందిన ఓ మహిళ పనుల నిమిత్తం బెంగళూరులో నివసిస్తోంది. ఎంత కష్టపడైనా తన కుమార్తెను చదివించాలని అనుకుంది. అయితే బెంగళూరులో చదివించే స్తోమత లేక తన అక్క ఇంటి వద్ద ఉంచుతూ చదవిస్తోంది.
తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో అని చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. లడ్డూ తయారీలో కల్తీ పదార్థాల వాడకం అంశంపై సీఎంకు టీటీడీ ఈవో శ్యామలరావు నివేదిక ఇచ్చారు. ఈవో ఇచ్చిన ప్రాథమిక నివేదికపై సమావేశంలో సీఎం చంద్రబాబు చర్చించారు.
తిరుమల లడ్డూను అపవిత్రం చేయడమంటే హిందువులు ముఖ్యంగా శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇది క్షమార్హం ఎంత మాత్రం కాదని చెప్పారు.