Home » Tirupati
Andhrapradesh: తిరుపతిలో ఏనుగుల బీభత్సం అంతా ఇంతా కాదు. గజరాజుల విజృంభన రైతులకు ఆవేదనను మిగిల్చింది. గత రోజులుగా ఏనుగుల హల్చల్తో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. రేణిగుంట మండలం చైతన్యపురం గ్రామంలో ఏకంగా 15 ఏనుగుల సంచారంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏనుగుల బీభత్సంతో పంట పొలాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో మామిడి పంటపై ఆధారపడ్డ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
Andhrapradesh: టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై బీజీపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి సంచనల ఆరోపణలు చేశారు. ఈవోపై కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. తిరుమలలో ఉండి స్వామి వారికి సేవలు చేయాల్సిన టీటీడీ ఈవో అధికార పార్టీ సేవలో తరిస్తున్నారని మండిపడ్డారు. ఆయనపైన పూర్తి సాక్ష్యాధారాలతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
బెంగళూరుతోపాటు పరిసర ప్రాంతాల్లో నివసించే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉగాది పండుగకు సొంతూళ్లకు వెళ్లేందుకు ఏపీఎస్ఆర్టీసీ(APSRTC) ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసినట్లు అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ (ఏటీఎం) రవీంద్రారెడ్డి తెలిపారు.
తిరుపతి: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆశయ సాధన కోసం ఆయన అసెంబ్లీలో చేసిన ప్రతిజ్ఞను నిజం చేయడం కోసం మహా కూటమి అభ్యర్థి ఆరని శ్రీనివాసులు గెలుపు కోసం పనిచేస్తామని తిరుపతి టీడీపీ ఇన్చార్జ్ సుగుణమ్మ స్పష్టం చేశారు.
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో ప్రజాగళం యాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. కూటమి అభ్యర్ధి నెలవల విజయశ్రీ, మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ, మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి తదితరులు హాజరయ్యారు.
తిరుపతి: వైసీపీతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని భావించిన అన్నా రామచంద్రయ్య యాదవ్.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాదవ సామాజిక వర్గాలకు అన్యాయం జరుగుతోందన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..
Andhrapradesh: 2024 ఎన్నికల తరువాత వైసీపీలో సీఎం అభ్యర్థి ఎవరన్నది ఆ పార్టీ నేతల్లోనే చర్చ జరుగుతోందని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏం జరిగినా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడటమేంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతిపక్షాలను విమర్శించడం విడ్డూరమన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీలో నెలజీతగాడు అంటూ కామెంట్స్ చేశారు.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముందు అధికార వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే ఒకరు.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీ వేదికగా ఈ చేరిక జరిగింది.
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దాదాపు 18 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇక మిగిలినవి 3 స్థానాలు మాత్రమే.
వైసీపీ(YSRCP) ట్రాప్లో పడి జనసేన(Janasena)కు నష్టం చేసే పనులు చేయొద్దని పార్టీ నేతలకు జనసేన నేత నాగబాబు(Nagababu) హెచ్చరించారు. గురువారం నాడు తాడేపల్లిలోని జనసేన కార్యాలయంలో తిరుపతి జనసేన నేతలతో నాగబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దాదాపు రెండు గంటల పాటు జనసేన నేతలతో నాగబాబు ఈ ఎన్నికల్లో కీలక విషయాలపై చర్చించారు.