Home » Tirupati
తెలంగాణకు చెందిన బాలుడు మహీధర రెడ్డి ఆచూకీ తిరుపతిలో లభ్యమైంది. డీఎస్పీ రవిమనోహరాచారి మంగళవారం వివరాలను మీడియాకు తెలిపారు.
తిరుపతి: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు, మొన్నటి ఎన్నికల్లో చంద్రగిరి వైసీపీ అభ్యర్థి, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్రెడ్డి శనివారం రాత్రి బెంగళూరులో అరెస్టయిన విషయం తెలిసిందే. దీంతో తిరుపతి పోలీసులు ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. పులివర్తి నానిపై దాడి కేసులో విచారణకు పిలిచినా మోహిత్ రెడ్డి సహకరించడం లేదు.
తిరుపతి: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ఢిల్లీకి వెళ్లి ధర్నా చేసారని.. అది ధర్నాలా లేదని.. డ్రామాలు ఆడేందుకు వెళ్లినట్టు ఉందని ఎద్దేవా చేశారు.
అమరావతి: తెలుగు రాష్ట్రాలలోని వేర్వేరు ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో ఐదుగురు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.
Andhrapradesh: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు తిరుమలలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని ఈవో శ్యామలారావు తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఈవోగా బాధ్యతలు తీసుకొని నెల రోజుల అయ్యిందన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి చాలా లోపాలను గుర్తించానన్నారు.
ప్రసిద్ధ కవి అడిగోపుల వెంకటరత్నం (83) శుక్రవారం ఉదయం తిరుపతిలో కన్నుమూశారు. 50 ఏళ్లుగా కవిత్వం రాస్తున్న ఆయన 28 కవితా సంపుటాలను వెలువరించారు.
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావు గురువారం వీఐపీ బ్రేక్ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
గంజాయికి బానిసైన ఓ జులాయి.. వృద్ధ మహిళను గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. ఆమె ఇద్దరు మనవరాళ్లపైనా ఇనుప రాడ్తో దాడి చేశాడు.
రేణిగుంట విమానాశ్రయానికి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ రోడ్డు రవాణా శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి(Minister Janardhan Reddy), ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే(Kantilal Dande) తదితరులు ఆయనకు పూలమాలలతో ఘనస్వాగతం పలికారు.
Andhrapradesh: రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి హుటాహుటిన జిల్లాకు బయలుదేరారు. తిరుపతి జిల్లా నాయుడపేట అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నిన్న(ఆదివారం) కలుషిత ఆహారం వల్ల పాఠశాలలోని దాదాపు 150 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.