Home » Tirupati
‘‘నా బిడ్డకి బ్లడ్ కేన్సర్. జూనియర్ ఎన్టీయార్‌కి వీరాభిమాని. రోజు రోజుకీ పరిస్థితి విషమిస్తోంది. ‘అమ్మా దేవర సినిమా చూసి చచ్చిపోతా.. 27వ తేదీ దాకా నన్ను బతికించండి..’ అని వేడుకుంటున్నాడు’’ అంటూ 19 ఏళ్ల కౌశిక్ తల్లి సరస్వతి కన్నీరు మున్నీరవుతూ వెల్లడించారు.
తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు.
ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన జరుగుతున్న ఉద్యోగుల బదిలీల్లో ఎక్కువ మంది తిరుపతి, చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేసేందుకు ఇష్టపడుతున్నారు. చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నుంచి తిరుపతికి వెళ్లేందుకు పెద్దఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. కానీ, తిరుపతి నుంచి చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకు వచ్చేవారు కరువయ్యారు. ఈ సమస్యపై బుధవారం చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు జూమ్ కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించనున్నారు.
అమెరికాలో దుండగులు జరిపిన కాల్పుల్లో తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరుకు చెందిన ఎన్ఆర్ఐ డాక్టర్ పేరంశెట్టి రమేశ్‌బాబు(64) దుర్మరణం చెందారు.
వివాహమైన 13 రోజులకే ఓ యువకుడు అలిపిరి(Alipiri) కాలినడక మార్గంలో గుండెపోటుతో మృతిచెందాడు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడు(Tamil Nadu)లోని తిరుత్తణికి సమీపంలో ఉన్న కీసలంకు చెందిన నరేష్(32) బెంగళూరులో స్థిరపడ్డాడు.
Andhrapradesh: తిరుపతిలోని ఓ ప్రైవేటు స్కూల్లో గురువారం ఉదయం విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. బైరాగిపట్డెడలోని సోక్రటీసు స్కూల్లో అగ్నిప్రమాదం సంభవించింది. అయితే ఆ సమయంలో పిల్లలు ఎలాంటి గాయాలు అవగా సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
నకిలీ టికెట్లతో శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్న అక్రమం ఒకటి టీటీడీలో బయటపడింది. ట్రావెల్స్, దళారీలతో కుమ్మక్కైన ఓ టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగి ఈ చర్యకు పాల్పడుతున్నట్టు తేలడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
టీటీడీలో ప్రక్షాళన స్పష్టంగా కనపడిందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. తిరుమల శ్రీవారిని సోమవారం (ఈరోజు)మంత్రి పయ్యావుల కేశవ్ దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మంత్రి పయ్యావుల మాట్లాడుతూ.. క్యూ లైనల్లో భక్తులకు టీటీడీ అన్నపానియాలను నిరంతరంగా పంపిణీ చేస్తుందని తెలిపారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి నవంబర్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఆన్లైన్ ద్వారా విడుదల చేయనుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం తిరుపతి జిల్లాలోని శ్రీసిటీ ప్రత్యేక ఆర్థిక మండలిని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా రూ.1,570 కోట్ల పెట్టుబడులతో, 8,480 మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయిలో ఏర్పాటైన 15 పరిశ్రమలను ఆయన ప్రారంభించనున్నారు.