Home » Tourist Places
వర్షాకాలం వచ్చిందంటే చాలు నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద పర్యాటకుల సందడి మామూలుగా ఉండదు. ఈసారి కుండపోత వర్షాలు కురవడంతో పెద్దఎత్తున జలాశయానికి నీరు చేరింది. ఎగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు చేరడంతో అన్ని గేట్లు ఎత్తి దిగువకు వదిలారు. దీంతో నాగార్జునసాగర్ డ్యామ్ నిండుకుండలా మారింది.
IRCTC Keral Tour Package 2024: వర్షాకాలంలో ప్రకృతి పచ్చదనంతో రమణీయంగా ఉంటుంది. అందుకే.. ఈ సీజన్లో చాలా మంది టూర్స్ ప్లాన్ చేస్తుంటారు. ముఖ్యంగా దేవ భూమి కేరళ ఈ సీజన్లో చాలా అందంగా ఉంటుంది. అందుకే..
ఏపీలోని నంద్యాల జిల్లాలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టానికి చేరుకుంటుండటంతో అధికారులు మూడు గేట్లు ఎత్తి ప్రాజెక్టు నుంచి నీటికి కిందికి వదిలారు.
తెలంగాణ పర్యాటక సంస్థకు కోట్లాది రూపాయల ఆదాయాన్ని సమకూరుస్తున్న హరిత హోటళ్లు, మరికొన్ని రిసార్టులు ప్రయివేట్పరం కానున్నాయి. వివిధ ప్రాంతాలనుంచి వచ్చే పర్యాటకులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ ఆహ్లాదాన్ని అందిస్తున్న హోటళ్లు, రిసార్టుల నిర్వహణను ప్రయవేట్ సంస్థలు, వ్యక్తులకు అప్పగించేందుకు పర్యాటక సంస్థ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
వర్షాకాలంలో సరదాగా గడుపుదామని వెళ్లిన వారికి ఊహించని పరిణామం ఎదురైంది. స్నేహితులతో కలిసి ఆనందంగా ఎంజాయ్ చేద్దామని అనుకున్న వారు మట్టిలో ఇరుక్కుపోయారు. వికారాబాద్ (Vikarabad) జిల్లాలోని ధరూర్ మండలం కోటిపల్లి ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ను (Kotipalli Project Backwater) చూసేందుకు హైదరాబాద్ నుంచి కొంతమంది పర్యాటకులు (Tourists) వెళ్లారు.
ప్రస్తుత బిజీ ప్రపంచంలో తమకోసం కొంత సమయం గడపాలని ప్రతిఒక్కరికీ అనిపిస్తుంది. అందమైన ప్రదేశాలకు వెళ్లి, కాసేపు ప్రశాంతంగా గడపాలని కోరుకుంటుంటారు. బాధ్యతలు, ఒత్తిళ్ల..
భారతదేశం బహుళ సంస్కృతులు, ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయం. భారతదేశంలోని రాష్ట్రాల్లో వివిధ సంస్కృతులు ఉన్నాయి. శతాబ్దాల క్రితం వివిధ రాష్ట్రాలను పాలించిన ఆయా రాజులు.. తమ పాలనలో వివిధ కట్టడాలు నిర్మించి భావి తరాలకు అందించారు. అందులో ఆధ్యాత్మికంగా కట్టిన వివిధ ఆలయాలే ఎక్కువగా ఉంటాయి. కరోనా తర్వాత దేశంలో పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందింది. ఎక్కడెక్కడ మంచి ప్రదేశాలు ఉన్నాయో వెతుకుతూ గూగుల్ను జల్లెడ పట్టేస్తున్నారు. అలాంటి వారికి తెలంగాణ రాష్ట్రం ఒక మంచి గమ్యం. అందులోనూ ముఖ్యంగా వరంగల్ నగరం, చుట్టుపక్కల ప్రాంతాలు ఒక చక్కని అనుభూతిని ఇస్తాయి.
భారతదేశం(india)లో వర్షాకాల రుతుపవనాలు (monsoon season) కొనసాగుతున్నాయి. దీంతో ఈ సీజన్లో ఎప్పుడైనా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే చాలా మందికి వర్షాకాలం అంటే ఇష్టం ఉంటుంది. వర్షంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి వేడి వేడిగా ఫుడ్ తింటూ ఎంజాయ్ చేయాలని అనేక మంది అనుకుంటారు. ఈ క్రమంలో ఈ సీజన్లో ప్రయాణించాల్సిన బెస్ట్ ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. అసలే పిల్లలకు వేసవి సెలవులు.. అంతా ఇంటి దగ్గరే.. దీంతో ఎండల నుంచి ఉపశమనం కోసం ఎక్కువమంది విహరయాత్రలకు వెళ్తుంటారు. కొందరు విదేశాలకు వెళ్తుంటే.. మరికొందరు వేసవిలోనూ చల్లగా ఉండే ప్రదేశాలకు వెళ్తుంటారు.