Home » TPCC Chief
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ అంటే కాళేశ్వరం కర్రెప్షన్ రావు అనే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యలు చేశారు. నాసిరకం పనులతో వేల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారని మండిపడ్డారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయాయన్నారు.
తొడలు కొట్టి భుజాలు ఎగిరేసిన వాళ్లు కేసీఆర్ వస్తుండడంతో ముఖం చాటేశారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మాచారెడ్డి మండల కేంద్రంలో రామారెడ్డి, మాచారెడ్డి మండలాల కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. కేసీఆర్ మీద పోటీ చేసేందుకు భయపడుతున్నారన్నారు. కొడంగల్‌లో గెలవలేని రేవంత్ రెడ్డి కామారెడ్డిలో గెలుస్తాడా అని ప్రశ్నించారు.
గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై టీజేఎస్ చీఫ్ కోదండరాం పోరాడుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. సోమవారం కోదండరాంతో భేటీ అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ ఆయన మద్దతు కాంగ్రెస్‌కు ఇవ్వాలని కోరేందుకు ఇక్కడికి వచ్చామన్నారు. తెలంగాణకు పట్టిన చీడ, పీడ వదలాలంటే కోదండరాం సహకారం అవసరమని తెలిపారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కలిసి ముందుకెళతామని చెప్పుకొచ్చారు.
టీజేఎఫ్ చీఫ్ కోదండరాంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సోమవారం ఉదయం నాంపల్లిలోని టీజేఎస్ ఆఫీస్‌కు చేరుకున్న రేవంత్, కర్ణాటక మంత్రి బోసురాజు.. కోదండరాంను కలిశారు.
మేడిగడ్డ విషయంలో కేసీఆర్ లాజిక్, కామన్ సెన్స్ కోల్పోయారనే అనుమానం ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ బస్సుయాత్ర... తుస్సుమనడం ఖాయం అంటూ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ట్వీట్ చేశారు. నిస్సిగ్గు మాటలకు, ఎదురుదాడులకు కేరాఫ్ అడ్రస్ డ్రామారావు అంటూ వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి అంట కాగింది మోడీ - కేడీ అని.. కాంగ్రెస్ ఇచ్చిన గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు పరిశ్రమకు పాతర వేసింది మోడీ - కేడీ అంటూ మండిపడ్డారు.
భూపాలపల్లిలోని 1 ఇంక్లైన్ గేట్ దగ్గర సింగరేణి కార్మికులతో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గురువారం ఉయదం గేట్ మీటింగ్ నిర్వహించారు. కార్మికుల సమస్యలను రేవంత్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికులు ప్రత్యక్ష భాగస్వాములన్నారు.
మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ప్రతాపసింగారంలోని సుధీర్‌రెడ్డి ఇంటికి వెళ్లిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. పార్టీ కండువా కప్పి సుధీర్‌ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.
హైదరాబాద్: సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ పదే పదే కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తున్నారని, డబ్బులు, మందు పంచి ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ చూస్తోందని ఆరోపిస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ అన్నారు.
హైదరాబాద్: నాంపల్లికి చెందిన వికలాంగురాలు (మరుగుజ్జు) రజినీ అనే యువతి మంగళవారం గాంధీభవన్‌లో టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసింది. తాను పీజీ పూర్తి చేశానని, ఉద్యోగం రాలేదని, ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగం ఇవ్వడం లేదని తన ఆవేదనను వ్యక్తం చేసింది.