Home » Trains
దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) పరిధిలో జరుగనున్న ఆర్ఆర్బీ అర్హత పరీక్షల అభ్యర్థుల కోసం ఈనెల 23 నుంచి 29వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు సీపీఆర్వో శ్రీధర్(CPRO Sridhar) ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 25 నుంచి జరగనున్న రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(Railway Recruitment Board) పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం వేర్వేరు ప్రాంతాల నుంచి 42 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు తెలియజేశారు.
గల్ఫ్ దేశాలకు అనంత అరటి ఎగుమతి అవుతోంది. ఈ సీజనలో తొలిసారిగా తాడిపత్రి రైల్వే స్టేషన నుంచి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు బనానా రైలు ముంబాయికి అరటి దిగుబడులతో బయలుదేరనుంది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బనానా రైలును విజయవాడ నుంచి వర్చువల్గా ప్రారంభిస్తారు. పెద్దపప్పూరు, పుట్లూరు, యాడికి మండలాల్లో 45 మంది రైతులు పండించిన అరటి దిగుబడులను 34 కంటైనర్లల్లో తరలిస్తారు. మొత్తం రూ.1.50 కోట్ల విలువైన 680 మెట్రిక్ టన్నుల అరటిని ...
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. రైలు పట్టాల వద్ద కొందరు కార్మికులు పనులు చేస్తుంటారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి.. పట్టాల మధ్యలో నిలబడి బ్యాగులో పరిశీలిస్తుంటాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..
రైలు ప్రయాణ సమయాల్లో అనూహ్య ఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చక్కర్లు కొడుతూనే ఉంటాయి. వాటిలో కొన్ని వీడియోలను చూస్తే షాక్ అయ్యేలా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఓ వ్యక్తి..
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. రైలు ప్రయాణ సమయాల్లో చిత్రవిచిత్రంగా ప్రవర్తించే వారిని చాలా మందిని చూస్తుంటాం. కొందరు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ అందరినీ షాక్కు గురి చేస్తుంటే.. మరికొందరు..
సాధారణ నిర్వహణ కారణాలతో దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే పరిధిలో నడుస్తున్న 10 రైళ్ల నంబర్లను మారుస్తున్నట్లు చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (సీపీఆర్ఓ) శ్రీధర్ తెలిపారు. విశాఖపట్నం-కడప(Visakhapatnam-Kadapa) మార్గంలో 17488/17487 నంబర్లతో నడిచే తిరుమల ఎక్స్ప్రెస్ కు 18521/18522 నంబర్లను కేటాయించారు.
తిరునల్వేలి నుంచి చెన్నై వస్తున్న వందే భారత్ రైలు(Vande Bharat train)లో ఇచ్చిన సాంబారులో చిన్న బొద్దింకలు ఉండడం ప్రయాణికులను దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ రైలులో శనివారం ఉదయం ప్రయాణించిన ఓ వ్యక్తికి ఇచ్చిన సాంబారు ఇడ్లీ(Sambar Idli)లో మూడు చిన్న బొద్దింకలను గమనించి రైలు అధికారులను తెలిపాడు.
అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం సికింద్రాబాదు, మచిలీపట్నం నుంచి కొల్లం మధ్య శబరిమలైకి ఈనెల 18 నుంచి నాలుగు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్(CPRO Sridhar) ఒక ప్రకటనలో తెలిపారు.
పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్(Raghavpur) సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో దెబ్బతిన్న ట్రాక్ను రైల్వే అధికారులు పునరుద్ధరించారు. యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టడంతో ప్యాసింజర్ రైళ్ల రాకపోకలు గురువారం ప్రారంభమయ్యాయి. మంగళవారం రాత్రి గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో 11 వ్యాగన్లు బోల్తా పడి మూడు లైన్ల ట్రాక్తో పాటు విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి.