Home » Trains
బస్సు, రైలు ప్రయాణ సమయాల్లో కొన్నిసార్లు ఊహించని ఘటనలు జరుగుతుంటాయి. కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఊహించని ప్రమాదాల్లో చిక్కుకుంటంటే.. మరికొందరు అమాయకులు నేరాగాళ్ల చేతిలో అనేక రకాలుగా మోసపోతుంటారు. ఇలాంటి ..
ప్రయాణికుల రద్దీ నియంత్రణకు శబరిమల(Shabarimala)కు గుంతకల్లు డివిజన్(Guntakal Division) మీదుగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. కాచిగూడ-కొట్టాయం-కాచిగూడ (వయా గుత్తి) ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
చెన్నై సెంట్రల్-గూడూరు సెక్షన్(Chennai Central-Gudur section) పరిధిలోని తడ, సూళ్లూరుపేట మధ్య రైలుమార్గంలో మరమ్మతుల కారణంగా శుక్రవారం సూళ్లూరుపేట, నెల్లూరు వెళ్లే మెము రైళ్లు కొన్ని పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా రద్దయినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
రాఘవాపురం-రామగుండం(Raghavpuram-Ramagundam) మార్గంలో గూడ్సురైలు పట్టాలు తప్పిన కారణంగా దక్షిణమఽధ్య రైల్వే హైదరాబాద్ నుంచి ఢిల్లీ వైపు వెళ్లే పలు రైళ్లను దారిమళ్లించింది. ఆ మార్గంలో నడవాల్సిన కొన్ని రైళ్లను కూడా రద్దు చేసినట్లు సీపీఆర్వో శ్రీధర్(CPRO Sridhar) తెలిపారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు యువకులు రీల్స్ చేసే క్రమంలో చివరకు డేంజరస్ స్టంట్స్ చేసేందుకు సిద్ధమయ్యారు. కదులుతున్న గూడ్స్ రైలు పైనుంచి దూకాలని నిర్ణయించుకున్నారు. అలాంటి ప్రయత్నాలు ప్రమాదమని తెలిసినా ఫేమస్ అయ్యేందుకు ఆ పని చేసేందుకు వెళ్లారు..
ప్రయాణికుల రద్దీ నియంత్రణకు రైల్వే శాఖ అనంతపురం మీదుగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. బెంగళూరు-బరౌనీ ప్రత్యేక రైలు (నం. 06563)ను ఈ నెల 12, 19 తేదీల్లో బెంగళూరులో రాత్రి 9-15 గంటలకు బయలుదేరి రెండు రోజుల తర్వాత 14, 21 తేదీలలో రాత్రి 8 గంటలకు బరౌనీకి చేరుకుంటుందన్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. రైల్వే స్టేషన్లలో ఒక ప్లాట్‌ఫామ్ నుంచి మరో ప్లాట్‌ఫామ్‌కు దాటే క్రమంలో కొందరు మెట్లు ఎక్కి వెళ్లకుండా పట్టాల పైనుంచి వెళ్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా..
ప్రయాణికుల సౌకర్యార్ధం సికింద్రాబాద్-విల్లుపురం-సికింద్రాబాద్(Secunderabad-Villupuram-Secunderabad) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. - నెం.07601 సికింద్రాబాద్-విల్లుపురం ప్రత్యేక రైలు సికింద్రాబాద్‌లో ఈ నెల 7,14 తేదీల్లో రాత్రి 7.40 గంటలకు బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.05 గంటలకు విల్లుపురం చేరుకుంటుంది.
స్టేషన్లో రైలు ఆగగానే ప్రయాణికులంతా ఎక్కుతూ, దిగుతూ ఉంటారు. అలాగే మరికొందరు ప్లాట్‌ఫామ్ పైకి వచ్చి తమకు కావాల్సిన ఆహార పదార్థాలు కొనుక్కుంటుంటారు. ఈ క్రమంలో ఓ యువతి కూడా రైలు దిగి, ప్లాట్‌ఫామ్‌పై కాస్త దూరంగా వచ్చి తనకు కావాల్సిన ఆహార పదార్థాలు కొంటుంది. అయితే..
చెన్నై సెంట్రల్-గూడూరు సెక్షన్(Chennai Central-Gudur Section)లోని తడ-సూళ్లూరుపేట మధ్య రైలుమార్గంలో మరమ్మతుల కారణంగా మూర్మార్కెట్ కాంప్లెక్-సూళ్లూరుపేట-నెల్లూరు మార్గంలో పలు మెము, సబర్బన్ రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే(Southern Railway) ఒక ప్రకటనలో తెలిపింది.