Home » Trending
చేతి కుస్తీ పోటీల్లో పాల్గొని అనూహ్యంగా చేయి విరగొట్టుకున్న ఓ వ్యక్తి వీడియో ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతోంది. జనాలు నోరెళ్లబెట్టేలా చేస్తోంది.
పట్టపగలు దొంగతనాలు జరిగిపోతున్న రోజులు ఇవి. బైక్లపై వస్తున్న దొంగలు మహిళల మెడలో నగలను చోరీ చేసి పారిపోతున్నారు. నగలు ధరించే బయటకు వెళ్లాలంటేనే భయపడిపోయే పరిస్థితులు సృష్టిస్తు్న్నారు. ఇలాంటి పరిస్థితిలో ఓ యువతి చేసిన వింత ప్రయోగం వైరల్గా మారింది.
బిస్కెట్లలో రంధ్రాలు ఎందుకుంటాయనే సందేహం బిస్కట్స్ తినే ప్రతి ఒక్కరికీ ఎప్పుడోకప్పుడు కలిగే ఉంటుంది. సాధారణ బిస్కెట్స్ మొదలు, క్రాకర్స్, బర్బన్స్ వరకూ అన్నింట్లో ఇవి కనిపిస్తుంటాయి. అయితే, వీటి వెనక పెద్ద కారణమే ఉందని బిస్కెట్ల తయారీదార్లు చెబుతున్నారు.
అమెరికాలో ఓ బాలిక సూపర్ మార్కెట్లో రచ్చ రచ్చ చేసిన ఉదంతం తాలూకు వీడియో ప్రస్తుతం సంచలనం కలిగిస్తోంది. బాలిక చేసిన పనికి సూపర్ మార్కెట్లోని వారందరూ ఏం జరుగుతోందో అర్థం కాక నోరెళ్లబెట్టారు.
శరీరంపై శాశ్వతంగా నిలిచుండే టాటూ వేయించుకునేందుకు పలు విషయాలు పరిగణలోకి తీసుకోవాలని అనుభవజ్ఞులు చెబుతున్నారు. అవేంటో ఈ కథనంలో సవివరంగా తెలుసుకుందాం.
ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా వెయ్యి ఇళ్లల్లోకి తాళాలు పగలగొట్టి చొరబడ్డాడు.. ఎందుకిలా అని పోలీసులు అడిగితే ఒత్తిడి తగ్గించుకునేందుకు అని చెప్పాడు. అతడి సమాధానం పోలీసులను కూడా ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఈ వింత ఉదంతం జపాన్లో వెలుగు చూసింది.
ఆరోగ్యం విషయంలో కొందరు తెలీక చేసే చిన్న చిన్న పొరపాట్లు చివరకు పెను ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. వీటిల్లో చెప్పుకోదగ్గది ఎక్కువ సేపు మూత్రం ఆపుకోవడమని వైద్యులు చెబుతున్నారు. ఈ అలవాటు భవిష్యత్తులో సమస్యలకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు.
మహీంద్రా కంపెనీ కార్లపై నెటిజన్ చేసిన తీవ్ర విమర్శలకు ఆనంద్ మహీంద్రా హుందాగా జవాబిచ్చి నెటిజన్ల మెప్పు పొందారు. ఈ ఉదంతం ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఆమె జీవితంలో ఎన్నడూ సిగరెట్ తాగి ఎరుగదు. అసలు ఆమెకు ధూమపానం అలవాటే లేదు. అలాంటి మహిళపై అధికారులు సంచలన ఆరోపణలు చేశారు. సిగరెట్ తాగి దాన్ని నేలమీద పడేసి చెత్త చేసినందుకు జరిమానా కట్టాలంటూ నోటీసులు పంపించారు. బ్రిటన్లో ఈ ఘటన వెలుగు చూసింది.
జర్మనీలో ఇంజినీర్గా చేసి చివరకు యాచకుడిగా మారానన్న బెంగళూరు వ్యక్తి ఉదంతంలో క్లారిటీ వచ్చింది. అతనెన్నడూ జర్మనీకి వెళ్లలేదని, మద్యానికి బానిసైన అతడు ఇంజినీరింగ్ చదువును మధ్యలో ఆపేసి ఇలా యాచకుడిగా మారాడని ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తాజాగా చెప్పుకొచ్చాడు.