Home » Trending
ఆరోగ్యం విషయంలో కొందరు తెలీక చేసే చిన్న చిన్న పొరపాట్లు చివరకు పెను ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. వీటిల్లో చెప్పుకోదగ్గది ఎక్కువ సేపు మూత్రం ఆపుకోవడమని వైద్యులు చెబుతున్నారు. ఈ అలవాటు భవిష్యత్తులో సమస్యలకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు.
మహీంద్రా కంపెనీ కార్లపై నెటిజన్ చేసిన తీవ్ర విమర్శలకు ఆనంద్ మహీంద్రా హుందాగా జవాబిచ్చి నెటిజన్ల మెప్పు పొందారు. ఈ ఉదంతం ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఆమె జీవితంలో ఎన్నడూ సిగరెట్ తాగి ఎరుగదు. అసలు ఆమెకు ధూమపానం అలవాటే లేదు. అలాంటి మహిళపై అధికారులు సంచలన ఆరోపణలు చేశారు. సిగరెట్ తాగి దాన్ని నేలమీద పడేసి చెత్త చేసినందుకు జరిమానా కట్టాలంటూ నోటీసులు పంపించారు. బ్రిటన్‌లో ఈ ఘటన వెలుగు చూసింది.
జర్మనీలో ఇంజినీర్‌గా చేసి చివరకు యాచకుడిగా మారానన్న బెంగళూరు వ్యక్తి ఉదంతంలో క్లారిటీ వచ్చింది. అతనెన్నడూ జర్మనీకి వెళ్లలేదని, మద్యానికి బానిసైన అతడు ఇంజినీరింగ్ చదువును మధ్యలో ఆపేసి ఇలా యాచకుడిగా మారాడని ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తాజాగా చెప్పుకొచ్చాడు.
ఇరవై ఏళ్ల పాటు ముక్కులో డైస్ ఇరుక్కుపోయి అవస్త పడ్డ ఓ చైనా యువకుడికి ఇటీవలే సమస్య నుంచి విముక్తి లభించింది. వైద్యుల ఆపరేషన్ విజయవంతం కావడంతో అతడ కోలుకున్నాడు.
నదిలో పడి మరణించిన యజమాని కోసం తీరం వద్దే గడ్డకట్టే చలిలో రోజుల తరబడి ఎదురు చూసిన శునకం ఉదంతం రష్యాలో వెలుగు చూసింది. అసలు జరిగిందేంటో తెలుసుకున్న నెటిజన్లు దాని పరిస్థితి తలుచుకుని కన్నీరుకారుస్తున్నారు.
హోటల్ళ్లల్లో అపరిశుభ్రత పేరు చెప్పి బెదిరింపులకు దిగే ఓ యువకుడు యాజమాన్యాల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డాడు. పది నెలల్లో ఏకంగా 63 హోటళ్లను ఇలా మోసం చేయడంతో అప్రమత్తమైన సిబ్బంది అతడి బండారం బయటపెట్టి ఊచలు లెక్కపెట్టేలా చేశారు. చైనాలో ఈ ఘటన వెలుగు చూసింది.
ఓ పెళ్లిలో వరుడు లోకాన్ని మర్చిపోయి మొబైల్లో ట్రేడింగ్ గ్రాఫ్‌లు చూస్తూ బిజీబిజీగా గడిపేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. జనాలు విస్తుపోయేలా చేస్తోంది.
భార్య కోసం ఖరీదైన బంగారు నగలు కొన్న ఓ వ్యక్తిని కలలో కూడా ఊహించని రీతిలో అదృష్టం వరించింది. షాపులో నిర్వహించిన బంపర్ లాటరీలో విజేతగా నిలిచిన అతడు రాత్రికి రాత్రి కోటీశ్వరుడైపోయాడు.
బెంగళూరు జనాల రేంజ్ ఇది అని అనిపించే మరో ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అక్కడి ఆటో డ్రైవర్ తన ఆటోలో ఏకంగా మినీ లైబ్రెరీ ఏర్పాటు చేయడమేకాకుండా కావాల్సిన వారికి ఉచితంగా పుస్తకాలు కూడా ఇచ్చేస్తున్నాడు.