Home » TS News
Telangana: రాష్ట్రంలో గురుకుల హాస్టల్లలో సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం జిల్లాలో హుస్నాబాద్ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... ప్రతి జిల్లా కలెక్టరు, శాననసభ్యులు, విద్యశాఖ అధికారులు గురుకుల హాస్టళ్లను బాధ్యతగా సందర్శించి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని ఆదేశించామన్నారు.
కాంగ్రెస్ పాలనలో.. పల్లెలు, పట్టణాలు కంపు కొడుతున్నాయని ట్విటర్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఓ వైపు తెలంగాణ పల్లెల్లో పాలన పూర్తిగా పడకేసిందన్నారు. మరోవైపు పట్టణాల్లో పరిస్థితి అధ్వాన్నంగా మారిందన్నారు.
Telangana: జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. దశాబ్దాల సాగు నీటి కల సాకారం చేసే సీతారామ ప్రాజెక్ట్ను రేపు (ఆగస్టు 15) ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేయనున్నారు. ముల్కలపల్లి మండలం పూసుగూడెం వద్ద పైలాన్ ఆవిష్కరించనున్నారు.
Telangana: ఖమ్మం జిల్లా రఘునాథ పాలెంలో సొంత మనవడినే అమ్మేసింది నాయనమ్మ. మనవడిని దత్తత పేరుతో హై డ్రామాకు తెరతీసింది. ఖమ్మంలో ఓ కార్పొరేటర్ భర్త సహకారంతో హైదారాబాద్వాసికి దాదాపు రూ. 5 లక్షలకు అమ్మకానికి పెట్టేసింది.
Telangana: తెలంగాణలో అవినీతిపరుల భరతం పడుతోంది ఏసీబీ. అన్ని శాఖలల్లో అవినీతిపరులపై ఏసీబీ దృష్టిసారింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 105 కేసులు నమోదు అయ్యాయి. వీటిలో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన కేసులే అధికంగా ఉన్నాయి. కోట్ల రూపాయల ఆస్తులు సంపాదిస్తున్న అధికారులపై అధికారులు నిఘా పెట్టారు.
సీఎం రేవంత్ రెడ్డి టీం విదేశీ పర్యటన పూర్తైంది. కాసేపట్లో రేవంత్ టీం హైదరాబాద్కు చేరుకోనుంది. ఉదయం 10.50 గంటలకు శంషాబాద్ చేరుకోనున్నారు. 10 రోజుల పాటు అమెరికా, సౌత్ కొరియాలో రేవంత్ టీం పర్యటించింది.
Telangana: గ్రేటర్లో ఆపరేషన్ హైడ్రా కొనసాగుతోంది. మంగళవారం నాడు జీహెచ్ఎంసీలో చెరువులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉప్పల్ నల్లచెరువులో కబ్జాలకు పాల్పడితే సహించేది లేదని హైడ్రా కమిషనర్ హెచ్చరించారు.
Telangana: ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో రాష్ట్రంలో అద్బుతంగా పనిచేస్తోందని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు అన్నారు. మంగళవారం మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో మాట్లాడుతూ.. గత ఎనిమిది నెలల కాలంలో రేవంత్ రెడ్డి అద్బుతమైన పాలన అందించారన్నారు.
ఏది నిజం.. ఏది అబద్ధం అనేది కొన్ని విషయాల్లో అర్థం కాదు. అలాంటిదే ఇది. ఈ రియల్ స్టోరీ చాలా ట్విస్టులు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం ఇన్స్టాలో పరిచయమైన వ్యక్తి ప్రేమ వేధింపుల కారణంగా బీఫార్మసీ చదువుతున్న తేజు అనే యువతి ఆత్మహత్య చేసుకుందంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలోని ఐటీఐ కాలేజీలు, గురుకులాల్లో కనీస వసతులు లేక సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేకపోవడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. పెద్దపల్లి, సంగారెడ్డి, అదిలాబాద్.. ఇలా రాష్ట్రంలో ఎక్కడి ఐటీఐల పరిస్థితి చూసినా అధ్వాన్నంగా ఉన్నాయన్నారు.