Home » TS News
Telangana: ఖమ్మం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి వైరా బహిరంగ సభ సన్నాహక సమావేశంలో మంత్రి తుమ్మల మీడియాతో మాట్లాడుతూ... గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేయాలనే సీతారామ ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశామన్నారు. గత ప్రభుత్వం 8 వేల కోట్లతో నిర్మించిన సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ మోటార్లు పాడవకుండా సద్వినియోగం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
వారాంతం వచ్చిందంటే పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టడం సర్వసాధారణం. ఈ డ్రంక్ డ్రైవ్‌లో రకరకాల వ్యక్తులు పోలీసులకు తారస పడుతూ ఉంటారు. కొందరు కామ్‌గా పోలీసులు చెప్పినట్టుగా చేసేసి వెళ్లిపోతున్నారు.
Telangana: నిజామాబాద్ నగరంలోని కోటగల్లి ఎస్సీ గర్ల్స్ హాస్టల్ లో ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహించారు. పిల్లలకు అందుతున్నకాస్మొటిక్ చార్జెస్, పౌష్టికాహారం, ఆడిట్ వివరాలపై అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏసీబీతో పాటు లీగల్ మెట్రాలాజీ, శానిటేషన్, ఫుడ్ ఇన్స్పెక్టర్, పే అండ్ అకౌంట్స్ శాఖల అధికారులు సోదాలు నిర్వహించారు.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూనే ఉంది. మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణమని చెప్పింది. అధికారంలోకి వచ్చీరాగానే అమలు చేసింది. అలాగే రైతాంగం ఎప్పుడప్పుడా అని ఎదురుచూస్తోన్న మూడో విడత రుణమాఫీపై సైతం తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.
అమెరికా నుంచి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా పలువురు పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలను ఆకర్షించడంలో విజయవంతమైన సీఎం రేవంత్‌రెడ్డి.. దక్షిణ కొరియాలోనూ దానిని కొనసాగిస్తున్నారు. అమెరికా పర్యటన ముగించుకుని శనివారం కొరియాకు చేరుకున్నారు.
డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌లు నేడు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను సందర్శించనున్నారు. పది రోజుల్లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.
Telangana: రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్న రేవంత్‌పై సోషల్ మీడియాలో కారుకూతలు కూస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి అమెరికాకు సరికొత్త తెలంగాణను పరిచయం చేశారన్నారు. పెట్టబడులకు తెలంగాణను స్వర్గంగా మార్చుతున్నారని అన్నారు.
Telangana: కోల్‌కత్తాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌ను రేప్ చేసి మర్డర్ చేసిన వారిని వదలొద్దు అంటూ బెంగాల్ ప్రభుత్వానికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో 31 ఏండ్ల ట్రైనీ డాక్టర్‌ను రేప్ చేసి హత్య చేసిన సంఘటన తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిందన్నారు.
సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది. కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు పెద్ద ట్విస్టే ఇచ్చింది. ఈడీ, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది.
Telangana: జిల్లాలో తెలంగాణ మంత్రుల పర్యటన కొనసాగుతోంది. సోమవారం ఉదయం నేలకొండపల్లి బౌద్ధ స్థూపంని సందర్శించిన మంత్రులు.. అనంతరం ఖమ్మం ఖిల్లాను సందర్శించారు. మంత్రులు భట్టివిక్రమార్క, తుమ్మల నాగేశ్వరావు, జూపల్లి కృష్ణారావు, ఖమం ఎంపీ రఘురాంరెడ్డి ఖిల్లాను సందర్శించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... ఖమ్మం జిల్లాలో టూరిజం అభివృద్దికి ప్రత్యేక కృషి జరుగుతోందన్నారు.