Home » TS News
Telangana: నగరంలోని హయత్‌నగర్‌లో భారీగా హషిష్ ఆయిల్ డ్రగ్ పట్టుబడింది. డ్రగ్‌ను సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను హయత్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వైజాగ్ నుంచి బెంగుళూరికి వయా హైదరాబాద్ మీదుగా హాష్ ఆయిల్‌ను ముఠా సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
Telangana: జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండల కేంద్రంలోని బౌద్ధ స్తూపాన్ని డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం ఉదయం సందర్శించారు. అనంతరం బౌద్ధ స్తూపం వద్ద పర్యాటక అధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Telangana: శంషాబాద్ బెంగుళూరు హైవే పై ఓ స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. సాతంరాయి వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్న పాద చారిని వేగంగా దూసుకొస్తున్న బస్సు ఢీకొట్టింది. బస్సు బలంగా ఢీకొనడంతో గుర్తుతెలియని వ్యక్తి గాలీలోకి ఎగిరి బస్సుపై పడ్డాడు. తీవ్ర గాయాలతో పాదాచారి ఘటనా స్థలంలో ప్రాణాలు విడిచాడు.
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం చేపట్టిన విదేశీ పర్యటన విజయవంతంగా సాగుతోంది.
Telangana: ‘‘కేటీఆర్‌ను రేవంత్ రెడ్డి జైల్లో వేస్తారనే నమ్మకం ఉంది...కేటీఆర్ చేసిన అరాచకాలు, అవినీతి అందరికీ తెలుసు...నాతో సహా బీజేపీ కార్యకర్తలను కేటీఆర్ హింసించిన, జైల్లో వేసిన తీరును ఎవరూ మర్చిపోలేదు. రేవంత్‌పై నమ్మకం పోయిన రోజు నుంచి కాంగ్రెస్‌తో జరగబోయేది యుద్దమే. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటైనా బీజేపీ ధాటికి తట్టుకోలేనంతగా యుద్దం చేస్తాం’’ అంటూ..
Telangana: వారంతా ఆశ్రమ పాఠశాల విద్యార్థులు.. ఇంటికి దూరంగా ఉంటూ ఆశ్రమంలో చదువుతున్నారు. వీరు ఇంటికి వెళ్లాలంటే ఆశ్రమ సిబ్బంది పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. లేదా తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్తుంటారు. కానీ కొత్తపల్లి ఆశ్రమ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఎలాంటి అనుమతి లేకుండానే బయటకు వచ్చారు.
Telangana: తెలంగాణ నార్కోటిక్ పోలీసుల డార్క్ వెబ్ ఆపరేషన్ నిర్వహించారు. డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్‌ను కస్టమర్లు ఆర్డర్ చేస్తున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. నార్కోటిక్ టెక్నికల్ వింగ్ ఇచ్చిన సమాచారంతో ఖమ్మం పోలీసులు ఈ ఆపరేషన్‌ను నిర్వహించారు. ఈ క్రమంలో డ్రగ్స్‌కు బానిసగా మారిన ఖమ్మం జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను గుర్తించారు. జూలై 31న డార్క్ వెబ్ ద్వారా సాఫ్ట్వేర్ ఇంజనీర్ డ్రగ్స్‌ను ఆర్డర్ చేశాడు.
Telangana: సోషల్ మీడియాను యువత ఎంతగా ఉపయోగించుకుంటున్నారో తెలిసిందే. అయితే సోషల్ మీడియా ద్వారా అనేక మంది ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా యువతులు తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కుంటున్నారు. ఫేస్బుక్, ఇన్‌స్టా గ్రామ్ ఇలా పలు మాధ్యమాల్లో ముఖపరిచయం లేని వ్యక్తులతో యువతులు మాట్లాడుతుంటారు.
Telangana: ప్రపంచంలో ప్రముఖ జంతు ఆరోగ్య సంస్థగా పేరొందిన జోయిటిస్ (Zoetis Inc.) కంపెనీ హైదరాబాద్‌లోని కెపాబులిటీ సెంటర్ విస్తరించాలని నిర్ణయించింది. 2024 సెప్టెంబర్ నుంచి ఈ విస్తరణ కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించింది. దీంతో వందలాది మందికి కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి. హైదరాబాద్‌లో జొయిటిస్ ఇండియా కెపాబిలిటీ సెంటర్‌ను విస్తరించనున్నట్లు ప్రకటించింది.