Home » TS News
థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో 17 రోజుల ఉత్పత్తికి సరిపడా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. అన్ని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి వారానికి ఒకసారి నివేదిక పంపాలని.. చీఫ్ ఇంజనీర్లను ఆదేశించారు.
Telangana: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన మున్సిపల్ రెవెన్యూ అధికారి నరేందర్‌ను ఏసీబీ అధికారులు హైదరాబాద్‌కు తరలించారు. అయితే ఈరోజు కోర్టుకు సెలవు కావడంతో మెహదీపట్నంలోని జడ్జి ఇంట్లో నరేందర్‌ను ప్రవేశపెట్టనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో జడ్జి ముందుకు నరేందర్‌ను తీసుకెళ్లనున్నారు.
Telangana: బంగ్లాదేశ్ పరిణామాలపై తెలంగాణ పోలీస్ శాఖ అలర్ట్ అయ్యింది. బంగ్లాదేశ్ ఉద్రిక్తత పరిస్థితులపై హైదరాబాద్‌లో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో ఉన్న బంగ్లాదేశీయులపై కూడా నిఘా పెట్టారు. హైదరాబాద్‌కు అక్రమంగా వస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.
Telangana: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు చుక్కుదురైంది. ఈ కేసులో నిందితులు బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు పిటిషన్ విచారణకు రాగా.. నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. అలాగే నలుగురు నిందితుల బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఏ2 ప్రణీత్‌రావు, ఏ3 తిరుపతన్న, ఏ4 భుజంగరావు, ఏ5 రాధాకిషన్‌రావు బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది.
Telangana: రాచకొండ పరిధిలో థార్ దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా ట్రావెల్స్ బస్సులలో దోపిడీలకు పాల్పడుతూ దొరికకాడికి దోచుకుంటుంది. ఇలా చోరీ చేసిన బంగారంతో పారిపోతుండగా రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు థార్ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.
Telangana: కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని రాష్ట్ర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత 2 లక్షల రైతుల రుణ మాఫీ చేస్తాం అని హామీ ఇచ్చామని.. చేసి చూపిస్తున్నామని తెలిపారు.
Telangana: రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిర్వాకంతో హైదరాబాద్ నగర ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. హైదరాబాద్ నగర త్రాగునీటి అవసరాల కోసం సుంకిశాల ప్రాజెక్టును నిర్మించారని తెలిపారు.
Telangana: హైదరాబాద్, ఆగస్టు 9: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న చెల్లెలు కవిత గురించి అన్న కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు, బీఆర్ఎస్ నేతలు తీహార్ జైలుకు వెళ్లి కవితతో ములాఖత్ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శుక్రవారం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ...
Telangana: బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై తెలంగాణా డీజీపీ జితేందర్ స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... బంగ్లాదేశ్ ఉద్రిక్తత పరిస్థితులపై హైదరాబాద్‌లో కూడా నిఘా పెట్టామన్నారు. హైదరాబాద్‌లో ఉన్న బంగ్లాదేశీయులపై నిఘా ఉంచామని... అయినా హైదరాబాద్‌కు అక్రమంగా వస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో గ్యాంగ్‌స్టర్ హత్య సంచలనం రేపుతోంది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్‌సీఐ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది.