Home » TS News
మహానగరం హైదరాబాద్‌లోని నల్లకుంట విద్యానగర్‌లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. చెయ్యెత్తినా ఆర్టీసీ బస్సును ఆపకపోవడంతో ఓ వృద్ధురాలు తీవ్ర ఆగ్రహంతో బస్సు డ్రైవర్‌పై పాముని విసిరింది.
Telangana: సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, క్రిశాంక్ చేసిన వ్యాఖ్యలను ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తిప్పి కొట్టారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ‘‘బాల్క సుమన్, క్రిశాంక్‌లు కేటీఆర్‌కు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. కేటీఆర్‌కు సుమన్, కృషాంక్ మధ్య చెడినట్లుంది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతం కావాలని కేటీఆర్ కోరుకున్నారని తెలిపారు.
Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా తెలంగాణకు వచ్చిన పెట్టుబడులన్నీ బోగస్ అంటూ ప్రచారం జరగడంపై ఐటి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ తీవ్రంగా ఖండించారు. మొన్న, నిన్న చేసిన కొన్ని పెట్టుబడుల ప్రకటనలు బోగస్ అని వార్తలు వెల్లువెత్తిన నేపథ్యంలో జయేశ్ రంజన్ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు.
Telangana: తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యాంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సాగుతోంది. ఇప్పటికే పలు కంపెనీల ప్రతినిధులతో రేవంత్ బృందం భేటీ అయ్యింది. తాజాగా ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో ప్రపంచంలో పేరొందిన చార్లెస్ స్క్వాబ్ కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చర్చలు నిర్వహించారు.
జనగామ డిపోకి చెందిన ఒక కండక్టర్‌ను అకారణంగా విధుల నుంచి తప్పించారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని... ఇది పూర్తి అవాస్తవమని టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు.
Telangana: ఆర్జే శేఖర్ బాషాపై కేసు నమోదు అయ్యింది. నటి లావణ్యపై దాడి చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు శేఖర్‌పై కేసు నమోదు చేశారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్లో డిబేట్ అనంతరం లావణ్యపై ఆర్జే శేఖర్ రెచ్చిపోయాడు. లావణ్యను బూతులు తిడుతూ దాడి చేశాడు. దీంతో శేఖర్ దాడి చేయడంపై బాధితురాలు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆపిల్ సంస్థ హెడ్ క్వార్టర్ అయిన ఆపిల్ పార్క్‌కు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవాళ వెళ్లనున్నారు. ఆపిల్ మ్యానిఫాక్చర్ టీమ్‌తో రేవంత్ భేటీ కానున్నారు. ట్రినేట్ కంపెనీ సీఈఓతో చర్చించనున్నారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. 18 గేట్ల నుంచి నీటిని విడుదల చేస్తు్న్నారు. ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో : 2,73,370 క్యూసెక్కులు. ఇక పూర్తి స్థాయి నీటి మట్టం : 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం : 585.40 అడుగులకు చేరుకుంది.
Telangana: బీఆర్ఎస్ పార్టీ పొత్తు, విలీనంపై గత కొద్దిరోజులుగా వస్తున్న వార్తలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఎక్స్(ట్విట్టర్) వేదికగా కీలక పోస్ట్ పెట్టారు. కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీపైన, విలీనం లాంటి దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు, వ్యక్తులు వెంటనే ప్రజలకి వివరణ ఇవ్వాలని.. లేదంటే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ తన సోదరులను తెలంగాణ మీదకు వదిలేశారని.. అతని సోదరులకు ఏ పదవులు లేకున్నా రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.