Home » TS News
Telangana: అర్హులై ఉండి రుణమాఫీ కాని రైతులు ఫిర్యాదు చేయాలని ఫోన్ నెంబర్ ఇస్తే వేలాది ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్‌లు వచ్చాయని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. దాదాపు 3 వేల 500 ఫోన్ కాల్స్ వచ్చాయని.. 40 వేలకు పైగా వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా రైతులు ఫిర్యాదు చేశారని తెలిపారు.
చేవెళ్ల రవి గురించి ఎవరికైనా తెలుసా? బిత్తిరి సత్తి.. అలియాస్ ఇస్మార్ట్ సత్తి.. తుపాకి రాముడు అంటే మాత్రం వెంటనే గుర్తు పట్టేస్తారు. అంతలా బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్నాడు చేవెళ్ల రవి. అతని బిత్తిరి మాటలు, చేతలు జనాల్లోకి బాగా వెళ్లిపోవడంతో బిత్తిరి సత్తిగా స్థిరపడిపోయాడు
మైలార్దేవ్ పల్లిలో రౌడీ షీటర్ సోహెల్ అతని అనుచరులు రెచ్చిపోయారు. అర్ధరాత్రి యూటూబ్ ఛానెల్ రిపోర్టర్ మూబీన్‌పై కత్తితో దాడి చేశారు. మూబీన్ శరీరంఅంతా కత్తి పోట్లకు గురైంది. అడ్డుకోబోయిన వారి పై కూడా దాడి చేసి సోహెల్ గ్యాంగ్ అక్కడి నుంచి పరారైంది.
Telangana: ఏపీలో పురాతన దేవాలయాలను, ఎండోమెంట్ భూములను కాపాడాలని ఈనెల 6న సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాశానని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. బుధవారం ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. లేఖపై ఏపీ సీఎంవో కార్యాలయం నుంచి తనకు ఇప్పటి వరకు ఎలాంటి రిప్లై రాలేదన్నారు. చంద్రబాబు నాయుడు తనకు రాజకీయ గురువన్నారు.
Telangana: ప్రేమజంటలే లక్ష్యంగా వసూళ్లకు పాల్పడుతున్న ఓ హోంగార్డును బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.కేబీఆర్ పార్కు జీహెచ్ఎంసీ వాక్ వేలో ప్రేమ జంటలు, స్నేహితులైన యువతీ యువకులను టార్గెట్ చేసి వారిని బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న ఇంటర్ సెప్టార్ పెట్రోలింగ్ వెహికల్ హోంగార్డుతో పాటు మరో బ్రోకర్‌ను ఖాకీలు అరెస్ట్ చేశారు.
Telangana: ఇరిగేషన్ అధికారులపై మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రామాలయం అన్నదాన సత్రం వద్ద వరద నీరు నిలవడంపై మండిపడ్డారు. మంత్రి ఆదేశాలను గోదావరి నది కరకట్ట స్లూయిజ్ లాక్‌లను ఎత్తి పట్టణంలోని వర్షపు నీటిని గోదావరిలోకి ఇరిగేషన్ అధికారులు విడుదల చేశారు. ఈ క్రమంలో ఉదయం నుంచి నీటిలో మునిగి వున్న రామాలయ ప్రాంతం వాసులకు ఉపశమనం కలిగనట్లైంది.
Telangana: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాలపాటు దగాపడ్డ చేనేతరంగానికి బీఆర్ఎస్ పదేళ్ల ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ స్వర్ణయుగం అంటూ పేర్కొన్నారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పెద్ద ఎత్తున నీరు సాగర్‌కు వస్తోంది. దీంతో సాగర్ నీటిమట్టం పెరిగింది. దీంతో ప్రాజెక్టుకు సంబంధించిన 20 గేట్లను పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
Telangana: ప్రజా గాయకుడు గద్దర్ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా గద్దర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులులర్పించారు. ఆయన చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు. ‘‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా... పోరు తెలంగాణమా’’ అంటూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలిచిన వ్యక్తి గద్దర్ అని కొనియాడారు. పేద కుటుంబంలో పుట్టి ఇంజినీరింగ్ విద్యను అభ్యసించిన గద్దర్ ఉన్నత కొలువుల వైపు దృష్టి సారించకుండా..
దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రౌస్ అవెన్యూ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉపసంహరించుకున్నారు.